»   » శిష్యుడి మాట: రామ్ గోపాల్ వర్మ ఎవరికీ ఏమీ నేర్పడు..

శిష్యుడి మాట: రామ్ గోపాల్ వర్మ ఎవరికీ ఏమీ నేర్పడు..

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమలో రామ్ గోపాల్ వర్మ దగ్గర పని చేసి, పని నేర్చుకున్న శిష్యులు చాలా మంది ఉంటారు. అందులో చాలా మంది దర్శకులుగా మరారు. అలాంటి వారిలో ఒకరు ‘జాదుగాడు' దర్శకుడు యోగేష్. వర్మ దగ్గర దాదాపు ఏడేళ్లు పని చేసిన యోగేష్ ‘ఒకరాజు ఒకరాణి' సినిమాతో దర్శకుడిగా మారాడు. ఆ తర్వాత వెంకీతో ‘చింతకాయల రవి' సినిమా తీసారు. త్వరలో ‘జాదుగాడు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

దర్శకత్వ శాఖలో వర్మ దగ్గర నుండి ఏం నేర్చుకున్నారు అని అడిగితే...ఆయన తనదైన రీతిలో స్పందించారు. వర్మ ఇలా చెయ్ అలా చెయ్ అని నాకు ఏమీ చెప్పలేదు. ఏమీ నేర్పించలేదు. వాస్తవానికి ఆయన ఎవరికీ ఏమి చెప్పడు, నేర్పించడు. కానీ ఆయన దగ్గర పని చేసిన వారి మీద ఆయన ప్రభావం విపరీతంగా ఉంటుంది. నా మీద కూడా ఆ ప్రభావం ఉంది. ఎప్పటీ అది అలానే ఉంటుంది అని చెప్పుకొచ్చారు యోగేస్.


Jadoogadu to release on June 26th

యోగేష్ దర్శకత్వం వహిస్తున్న ‘జాదుగాడు' సినిమా విశేషాల్లోకి వెళితే...'యేగేష్‌' దర్శకత్వంలో, వి.వి.యన్‌.ప్రసాద్‌ నిర్మాతగా 'సత్య ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తోంది. 'ఊహలు గుసగుసలాడే', దిక్కులు చూడకు రామయ్య, లక్ష్మీ రామే మా ఇంటికి వంటి విజయవంతమైన చిత్రాల యువ హీరో 'నాగశౌర్య ఈ చిత్ర కథానాయకుడు కాగా, నాయికగా 'హరహర మహాదేవ' హిందీ సీరియల్‌లో పార్వతిగా నటించిన సోనారిక ఈ చిత్రం ద్వారా నాయికగా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు.


సినిమా గురించి యోగేష్ మాట్లాడుతూ...నాగశౌర్య ఇప్పటివరకు ప్రేమ కథా చిత్రాల నాయకుడిగా నటించారు. కానీ ఈ చిత్రంలో అతని పాత్ర గత చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. లోన్‌ రికవరీ బిజినెస్‌ చేసే పాత్రలో ఈ చిత్ర కథానాయకుడు కనిపిస్తారు. కథానాయిక సోనారికతో ప్రేమలో పడ్డ తరువాత లోకల్‌ గ్యాంగ్‌ లీడర్‌తో కథానాయకుడి వివాదం ఇటు కౖథను, అతని జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పిందన్నది చిత్రమని, మాస్‌ ప్రేక్షకులను సైతం ఆకట్టుకునే విధంగా ఈ చిత్రంలో కథానాయకుడి పాత్రను తీర్చిదిద్దడం జరిగిందని, వినోదంతో కూడిన మాస్‌ కథా చిత్రం ఈ 'జాదుగాడు' అన్నారు దర్శకుడు.


Jadoogadu to release on June 26th

ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు, అజయ్, శ్రీనివాస్‌రెడ్డి, పృథ్వీ, సప్తగిరి, తాగుబోతు రమేష్‌, జాకీర్‌ హుస్సేన్‌, ఆశిష్‌ విద్యార్థి, రవికాలే, 'ప్రభాస్‌ శ్రీను, 'రాకెట్‌ రాఘవ', 'అదుర్స్‌ రఘు', స్వామిరారా సత్య, ఫిష్‌ వెంకట్‌లు నటిస్తున్నారు. సాంకేతిక వర్గం: సినిమాటోగ్రాఫర్‌సాయిశ్రీరామ్‌, ఎడిటర్‌: యం.ఆర్‌.వర్మ: ఆర్ట్‌:సాహి సురేష్‌, ఫైట్స్‌: వెంకట్‌, కథ, మాటలు: మధుసూదన్‌, పాటలు: వరికుప్పల యాదగిరి, శ్రీమణి, విశ్వ. నిర్మాత: వి.వి.ఎన్‌.ప్రసాద్‌, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: యోగేష్‌.

English summary
Naga Shourya, Sonarika starrer Jadoogadu, directed by Yogesh of 'Chintakayala Ravi' fame, will be released on June 26th. V.V.N.Satya of Sathyaa Entertainments produced the film. Sagar Mahathi is the music director.
Please Wait while comments are loading...