»   » అప్పట్లో సౌందర్య తో పెళ్లి విషయమై జగపతిబాబు

అప్పట్లో సౌందర్య తో పెళ్లి విషయమై జగపతిబాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : అప్పట్లో జగపతి బాబు, సౌందర్య కి పెళ్లవుతుందనే వార్తలు తెగ వచ్చాయి. అయితే అనుకోని విధంగా సౌందర్య చనిపోయింది. అయితే చాలా కాలం తర్వాత జగపతిబాబుని ఈ విషయమై మీడియావారు సౌందర్య కారణంగా మీ వైవాహిక జీవితంలో కొంచెం ఆటుపోట్లు వచ్చాయని అప్పట్లో ఓ వార్త వచ్చింది. సౌందర్యను పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారట? అని ప్రశ్నించారు. ఆ వార్తలను ఆయన ఖండిస్తూ మాట్లాడారు.

జగపతిబాబు మాటల్లోనే...అది పచ్చి అబద్ధం! నాకూ సౌందర్యకు చాలాసార్లు ముహూర్తం పెట్టారు. నా భార్యకే ఫోన్ చేసి చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకసారి నేను, మా ఆవిడ ఇంట్లో కూర్చుని మాట్లాడుకుంటుంటే ఎవరో ఫోన్ చేసి, 'పన్నెండున్నరకి సౌందర్యతో మీ పెళ్లని విన్నాము' అన్నారు. అప్పుడు టైమ్ పన్నెండు పదయ్యింది. ఎవరో ఏదో ఊహించేసుకుని ఏదేదో చెప్పేస్తుంటారు. అఫ్‌కోర్స్ సౌందర్య నాకు చాలా క్లోజ్. తనెంత క్లోజో తన అన్నయ్య అమర్ కూడా అంతే క్లోజ్. ఆ విషయం బయటికి రాదు కదా. ఒకసారి నేనెవర్నో రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్‌పోర్ట్‌కెళ్లాను. అదే సమయంలో సౌందర్య ఎయిర్‌పోర్ట్‌కొచ్చింది. దాంతో సౌందర్య కోసమే వచ్చానని ప్రచారం చేశారు.

సౌందర్య, అమర్ నాకు మంచి ఫ్రెండ్స్. ఓసారి నాకు 20 లక్షలు అవసరమైతే, ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అమర్ ఇచ్చాడు. ఆ తర్వాత నేను వెనక్కి ఇచ్చేశాను. మా మధ్య నమ్మకంతో కూడిన మంచి స్నేహం మాత్రమే ఉండేది. ఏదో కవర్ చేయడానికి నేనిలా చెప్పడంలేదు. నిజం చెప్పాను. ఇక్కడ బోయ్, గాళ్ అని కాదు.. ఫ్రెండ్‌షిప్ అనేది ఒకటుంటుంది. కానీ దాన్ని దాటేసి ఆలోచిస్తారు. అదే ప్రాబ్లమ్. ఇక సౌందర్య మరణ వార్త విన్నప్పుడు మలేసియాలో ఉన్నాను. మా అన్నయ్య ఫోన్ చేసి, 'బ్యాడ్ న్యూస్... సౌందర్య చనిపోయింది' అన్నాడు. నేనేమీ అనలేదు. 'అమర్ కూడా చనిపోయాడా? చనిపోయి ఉంటే ఫోన్ చేయొద్దు' అన్నాను. నాకు తెలుసు... అమర్ కూడా చనిపోయి ఉంటాడని! ఆ అన్నాచెల్లెళ్ల అనుబంధం అలాంటిది అన్నారు.


తన మీదున్న ఇమేజ్ కారణంగా, సౌందర్య విషయంలోనూ భార్య ఎప్పుడూ అభద్రతాభావానికి గురవ్వలేదనే విషయం చెప్తూ... ఫీలయ్యిందో లేదో నాకు తెలియదు. కానీ ఎప్పుడూ కూల్‌గానే ఉంటుంది. పెళ్లప్పుడు నేను తనతో ఒకటే చెప్పాను. 'సినిమా ఇండస్ట్రీ అంటే ఎఫైర్లు ఉంటాయి. నువ్వు మెంటల్లీ ప్రిపేర్ అయితేనే ఇండస్ట్రీకి వెళతాను. లేకపోతే లేదు' అని! 'ఎక్కడికైనా వెళ్లండి.. కానీ ఇంటికి రండి' అని కూల్‌గా చెప్పింది తను. అప్పుడప్పుడూ ఎవరైనా ఫీలవుతారు. నేను తనను బాగా చూసుకుంటాను. తను కూడా నన్ను చాలా అర్థం చేసుకుంటుంది. అంత అర్థం చేసుకునే భార్య లభించడం ఏ హీరోకైనా అదృష్టం. ఫైనాన్షియల్‌గా చేదు అనుభవాలు ఎదురైనప్పుడు కూడా మా మధ్య ఏదైనా చిన్నపాటి డిస్కషన్స్ జరిగి ఉంటాయేమో కానీ.. పెద్ద పెద్ద డిస్కషన్లు జరగలేదు అన్నారు.

English summary
Jagapathi babu says that Sowandarya is just a friend. He says he is very sad when she is died.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu