»   » మా తప్పులూ ఉన్నాయి: జగపతి బాబు సినిమా దారుణమైన ఫ్లాప్ వెనక సంగతులివే

మా తప్పులూ ఉన్నాయి: జగపతి బాబు సినిమా దారుణమైన ఫ్లాప్ వెనక సంగతులివే

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఐతే విడుదలకు ముందు 'పటేల్ సార్' గురించి గొప్పగా చెప్పిన జగపతిబాబు.. ఇప్పుడు మరోలా మాట్లాడాడు. ఈ సినిమా విషయంలో తాము తప్పులు చేశామని అంగీకరించాడు జగపతిబాబు.హీరోగా కెరీర్ చరమాంకానికి వచ్చేసిన దశలో విలన్.. క్యారెక్టర్ రోల్స్ లోకి మారి తిరుగులేని డిమాండ్.. క్రేజ్ సంపాదించుకున్నాడు జగపతిబాబు. కొన్నేళ్ల పాటు హీరో వేషాలకు దూరమైపోయిన ఆయన మళ్లీ ఇప్పుడు 'పటేల్ సర్' అనే సినిమా చేశాడు.

ఎంతో ప్రత్యేకత ఉంది కాబట్టే

ఎంతో ప్రత్యేకత ఉంది కాబట్టే

హీరో అనిపించుకోవాలని ఈ సినిమా చేయలేదని.. కథలో.. పాత్రలో ఎంతో ప్రత్యేకత ఉంది కాబట్టే ఇందులో నటించానని చెప్పాడు జగపతి.జగపతిబాబు మళ్లీ హీరోగా కూడా తన జోరు చూపిస్తాడేమో అని అంచనా వేశారు. సాయి కొర్రపాటి లాంటి అభిరుచి ఉన్న నిర్మాత ఈ సినిమాను నిర్మించడం కూడా ఈ చిత్రంపై అంచనాలు పెంచుకోవడానికి కారణమైంది.

Patel S.I.R Movie Talk By Celebrities And Baby Dolly : Jagapathi Babu
దారుణమైన పరాజయం

దారుణమైన పరాజయం

ఐతే ‘పటేల్ సార్' ఆ అంచనాల్ని ఎంతమాత్రం అందుకోలేకపోయింది. ప్రేక్షకుల్ని తీవ్ర నిరాశకు గురి చేసి ఫ్లాప్ అయింది. అనుకున్నంత రేంజి లో ఏమాత్రం లేకపోగా దారుణమైన పరాజయం పాలైంది సినిమా.. ఈ సినిమాకి సాయి కొర్రపాటి నిర్మాతే అయినా .. జగపతిబాబు కూడా కొంత పెట్టుబడి పెట్టినట్టుగా వినికిడి. పైగా పారితోషికం కూడా తీసుకోలేదని అంటున్నారు.

నిజాన్ని ఒప్పేసుకున్నా.డు

నిజాన్ని ఒప్పేసుకున్నా.డు

అందువలన ఈ సినిమా జగపతిబాబుకి నష్టాన్నే తీసుకొచ్చిందని చెప్పుకుంటున్నారు. జగపతిబాబు ఇలాంటి ప్రయోగాలు చేయకపోవడమే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సినిమా రావటానికి ముందు చాలా అద్బుతంగా ఉంటుందని ప్రమోట్ చేసిన జగపతిబాబు ఇప్పుడు నిజాన్ని ఒప్పేసుకున్నాడు. సినిమా విషయం లో జరిగిన పొరపాట్లని ఇలా చెప్పాడు.

నిరాశపరిచింది

నిరాశపరిచింది

"పటేల్ సార్ సినిమా నిరాశపరిచింది. ఆ సినిమాపై చాలా ఆశలు పెట్టుకుున్నా. మా వైపు నుంచి కొన్ని తప్పులు జరిగాయి. ట్రైలర్ చూసిన ప్రేక్షకులు ఇదేదో థ్రిల్లర్, హార్రర్ టైపు సినిమా అనుకున్నారు. కానీ మేం కుటుంబ కథను చూపించేసరికి నిరాశ చెందారు.

మామూలు భోజనం పెట్టాం

మామూలు భోజనం పెట్టాం

ప్రేక్షకులు బిరియానీ కోసం వస్తే మేం మామూలు భోజనం పెట్టాం. అందుకే అంచనాలు తారుమారయ్యాయి" అని జగపతిబాబు తెలిపాడు. మళ్లీ హీరోగా సినిమా చేయాలా వద్దా అనే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. ఏదైనా కథను బట్టే ఉంటుందని జగపతిబాబు తెలిపాడు.

English summary
Jagapati Babu who turned as Villon of Tollywood from a family hero shared a feeling on hes latest movie Patel sir flop
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu