For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హీరోకి అన్నయ్యగా... జగపతిబాబు

  By Srikanya
  |

  Jagapathi Babu
  హైదరాబాద్ : హీరో గానే కాదు, కథలో కీలకమైన పాత్రలు పోషించడానికీ ఉత్సాహం చూపిస్తుంటారు జగపతిబాబు. 'అంతఃపురం', 'లక్ష్యం', 'అనుకోకుండా ఓ రోజు' తదితర సినిమాల్లో ఆయన పాత్రలు ప్రేక్షకుల్ని ఆకట్టుకొన్నాయి. బాలకృష్ణ-బోయపాటి శ్రీను కలయికలో రూపుదిద్దుకొంటున్న చిత్రంలో విలన్ గా కనిపించబోతున్నారు. ఇప్పుడు సందీప్‌కిషన్‌కి అన్నయ్యగా నటిస్తున్నారు. సందీప్‌కిషన్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'రారా కృష్ణయ్య'. రెజీనా హీరోయిన్ గా నటిస్తోంది. మహేష్‌ దర్శకుడు.

  ఎస్‌వీకే సినిమా బ్యానర్‌పై మహేష్ నిర్మాణ దర్శకత్వంలో రూపొందుతున్న 'రారా కృష్ణయ్య' సినిమా షూటింగ్ రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ యువతకు సందేశాన్నిచ్చే ఈ చిత్రంలో హీరోగా సందీప్‌కిషన్, హీరోయిన్‌గా రెజినాతోపాటు పలువురు సహనటులు నటిస్తున్నట్లు తెలిపారు. డ్యాన్స్ మాస్టర్ సుచిత్ర చంద్రబోస్ పర్యవేక్షణలో హీరోహీరోయిన్‌లపై పాట చిత్రీకరించారు. సినిమాకు కెమెరామెన్‌గా సాయి శ్రీరాం, సంగీతదర్శకుడిగా అచ్చిలు వ్యవహరిస్తున్నారని ఆయన తెలిపారు.

  సందీప్‌ కిషన్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'డీకే బోస్‌'. నిషా అగర్వాల్‌ హీరోయిన్. ఎన్‌.బోస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. శేషురెడ్డి, ఆనంద్‌రంగా నిర్మాతలు. ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. యూత్ ఫుల్ ఎంటర్టెనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రానికి సంబంధించిన ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్, శాటిలైట్ రైట్స్ ఇప్పటికే మంచి రేటుకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. ప్రేమ కథా చిత్రమ్‌లో కామెడీ పండించిన సప్తగిరి ఈచిత్రంలోనూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే పాత్ర పోషిస్తున్నట్లు యూనిట్ సభ్యులు చెబుతున్నారు.

  నిర్మాతలు మాట్లాడుతూ ''అవినీతిపరుడైన యువ పోలీసు అధికారి కథ ఇది. పైసా ముట్టందే ఏ పనీ చేయని అతగాడు ప్రేమలో పడ్డాక ఎలా మారిపోయాడన్నది తెరపైనే చూడాలి. ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన వచ్చింది. సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది'' అన్నారు.

  దర్శకుడు ఎన్.బోస్ మాటల్లో... 'ఆ పోలీస్‌ ఆఫీసర్ డబ్బు కోసం ఎలాంటి పనినైనా చేయడానికి సిద్ధపడతాడు. తాను పోలీస్‌ఆఫీసర్‌గా గోల్డ్‌మెడల్స్ అందుకోవాలని రాలేదు. గోల్డ్ బిస్కెట్స్ సంపాందించడానికి వచ్చాను అనుకునే తత్వం అతనిది. అలాంటి ఆ యువ పోలీస్ ఓ అమ్మాయి ప్రేమలో పడతాడు. అప్పుడు అతనిలో వచ్చిన మార్పేమిటి? అనేది చిత్ర కథ అన్నారు. ఈ చిత్రంలో సంపత్ కుమార్, అన్నపూర్ణమ్మ, బ్రహ్మాజీ, కోట శ్రీనివాసరావు, అజయ్ కుమార్, మల్లాది, సత్తెన్న, రవి వర్మ తదితరులు నటిస్తున్నారు.

  English summary
  Jagapathi Babu , who acted in many movies in the main lead, will be seen in a totally different avatar as a villain in the upcoming action entertainer “Legend” directed by Boyapati Srinu. This hero will be appearing in a totally different role as the brother of the young hero Sandeep Kishan in the upcoming film “Raa Raa Krishnayya”. It is directed by Mahesh, who is the disciple of the popular director Krishna Vamsi. Regina Cassandra is paired opposite to this talented hero. Vamsi Krishna Srinivas, who earlier produced the movie “Solo” is the producer on SVK Cinema Banner.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X