»   » ‘చట్టం’ నీ యబ్బ సొత్తా అంటూ శరవేగంగా దూసుకుపోతున్నాడు...

‘చట్టం’ నీ యబ్బ సొత్తా అంటూ శరవేగంగా దూసుకుపోతున్నాడు...

Posted By:
Subscribe to Filmibeat Telugu

చట్టాలు సరిగా అమలుకాకపోతే ఓ సామన్య మానవుడికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయన్న కథతో జగపతిబాబు, విమలారామన్‌ జంటగా నటిస్తోన్న చిత్రం 'చట్టం'. 'నీ యబ్బ సొత్తా". పిఎ అరుణ్‌ ప్రసాద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. నట్టి కుమార్‌, తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మాతలు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ముఖ్య సన్నివేశాలను శరవేగంగా చిత్రీకరిస్తున్నారు. నేటి నుంచి కథానాయిక విమలారామన్ షూటింగ్ లో పాల్గొంటారు. ఈ నెలాకరు వరకు ఇక్కడే షూటింగ్ జరుగుతుందని, జనవరి మొదటి వారంలో ముంబైలో కీలక సన్నివేశాలు తీయడంతో షూటింగ్ పార్ట్ పూర్తవుతుందని నిర్మాతలు తెలిపారు.

దర్శకుడు అరుణ్ ప్రసాద్ మాట్లాడుతూ 'ప్రజా సంక్షేమం, క్రమబద్ధమైన పరిపాలన కోసమే చట్టాలు ఏర్పాటైయ్యాయి. కొంతమంది వ్యక్తులకు చట్టాన్ని అతిక్రమించడం ఓ అలవాటుగా మారింది. అక్రమాలకీ, దుర్మార్గాలకీ పాల్పడి కూడా తప్పించుకొంటున్నారు. కాబట్టే సామాన్య ప్రజలకు చట్టంపై నమ్మకం పోతుంది. ఓ పోలీస్‌ అధికారి చట్టాన్ని రక్షించే క్రమంలో చేసిన పోరాటాలేంటో తెర పైనే చూడాలన్నారు. జీవా, రావు రమేష్‌, మురళీశర్మ, బ్రహ్మానందం, వేణుమాధవ్‌, ఆశిష్‌ విద్యార్థి, ప్రదీప్‌ రావత్‌ తదితరులు ఇతర పాత్రధారులు. సంగీతం: ఎమ్‌.ఎమ్‌.శ్రీలేఖ.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu