»   »  కమ్మ కులం గొప్పేంటి? మరోసారి జగపతి సంచలన వ్యాఖ్యలు

కమ్మ కులం గొప్పేంటి? మరోసారి జగపతి సంచలన వ్యాఖ్యలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కుల ప్రస్తావనకు, మతాల పట్టింపుకు వీలైనంత దూరంగా ఉండే జగపతి బాబు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. తాజాగా ఇంటర్వ్యూలో జగపతి బాబు మాట్లాడుతూ...''నాకు కుల - ప్రాంత భేదాలు లేవు. ఉంటే 'జై బోలో తెలంగాణ' సినిమా చేసేవాణ్ణి కాదు. కులాలు లేని సమాజాన్ని కోరుకుంటాను అన్నారు.

ఒక కులాన్ని బీసీలో చేర్చాలనీ.. ఇంకో కులాన్ని ఎస్సీ లేదా ఎస్టీలో చేర్చాలనే డిమాండ్లు రాజకీయపరమైనవిగా నేను భావిస్తాను. నేను కమ్మవాడిగా పుట్టాను కాబట్టి ఈ మాటలు చెప్పడం లేదు. ఏ కులంలో పుట్టినా ఇవే మాటలంటాను. కమ్మవాడిగా పుట్టినంత మాత్రాన నా గొప్పేమిటంటాను. మిగతా అందరిలాగే కమ్మవాళ్లూ పుట్టారు. అలాంటప్పుడు వాళ్ల గొప్ప - ప్రత్యేకత ఏముంటాయి?'' అని ప్రశ్నించారు జగపతి.

ఈ సందర్భంగా జగపతి కొన్నేళ్ల కిందట విజయవాడలోని సిద్ధార్థ కాలేజీ ఫంక్షన్ కు వెళ్లినపుడు తనకు ఎదురైన ఓ సంఘటనను గుర్తు చేసుకున్నారు. ''ఆ కాలేజీ ఫంక్షన్లో తాను కమ్మ కులం గురించిమాట్లాడతానిన ప్రిన్సిపాల్ తో అంటే ఆయన వద్దని వారించారు. 'మీరు ఒక్కరే. ఆడిటోరియంలో రెండు వేల మంది విద్యార్థులున్నారు. వాళ్లలో కమ్మవాళ్లదే డామినేషన్. మీరు దీనిపై ఏమైనా మాట్లాడితే వాళ్లు మిమ్మల్ని ఏమైనా చేయొచ్చు' అని హెచ్చరించారు. కానీ నేను ఆయన మాటల్ని పట్టించుకోలేదు. ఏం మాట్లాడాలనుకున్నానో అదే మాట్లాడాను. కమ్మవాళ్ల గొప్పేంటని ప్రశ్నించాను. 'మీ ప్రిన్సిపాల్ ఇలా అన్నారయ్యా' అని కూడా చెప్పాను. 'ఇప్పుడు మీరేం చేస్తారు? నన్ను చంపుతారా? అయితే రండి. చంపండి' అన్నాను. వెంటనే ఆడిటోరియం చప్పట్లతో మారుమోగిపోయింది' అని జగపతి అన్నారు. సమాజంలో కుల వ్యవస్థ పోవాలని, అప్పుడే మన దేశం బాగుపడుతుందని జగపతి బాబు ఈ సందర్భంగా అభిప్రాయ పడ్డారు.

Jagapathi Babu comments about Caste

కూతురు పెళ్లి విషయంలో కూడా...
ఆ మధ్య జగపతి బాబు కూతురు అమెరికా శ్వేత జాతీయుడిని ప్రేమించిన పెళ్లాడిన సంగతి తెలిసిందే. కూతురు కోరిక మేరకు జగపతి బాబు అండ్ ఫ్యామిలీ ఈ పెళ్లికి అంగీకరించి అంగరంగ వైభవంగా చేసారు. అయితే జగపతి కూతురు అమెరికా వ్యక్తిని పెళ్లాడటంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేసారట.

జగపతి బాబు ఈ విషయమై మాట్లాడుతూ.....వంశ‌మైన వీర‌మాచ‌నేని అంటే క‌మ్మ కులంలో పెద్ద ఫ్యామిలీ అని అలాంటిది త‌న కుమార్తెకు ఓ అమెరికా అల్లుడితో పెళ్లి జ‌రిపించ‌డం ఏంట‌ని కొంద‌రు నన్ను ప్ర‌శ్నించార‌ు. వారికి నేను ఒకటే చెప్పాను. మా అమ్మాయి..ఆ అబ్బాయి ఇష్ట‌ప‌డ్డారు. పెళ్లి చేస్తున్నాం. ఇందులో కులాల ప్ర‌స్తావ‌న ఎందుకుని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

కులాల గురించి మాట్లాడుకోవడం టైం వేస్ట్ అని జగపతి బాబు అన్నట్లు తెలుస్తోంది. నాకు వారసులు లేరు. నాతోనే వీరమాచినేని వంశీ అంతం అవుతుందని అంటున్నారు. నేను చనిపోయాక ఇక్కడ ఏం జరుగుతుందో నేను చూడను. అయినా ఈ కాలంలో కూడా కులాల ప్ర‌స్తావ‌న అంతా ట్రాష్ అని జగపతి బాబు కొట్టి పారేసినట్లు సమాచారం.

English summary
Tollywood actor Jagapathi Babu Sensational Comments about Caste.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu