»   »  కులం, కూతురు పెళ్లిపై....జగపతి బాబు సంచలన వ్యాఖ్యలు!

కులం, కూతురు పెళ్లిపై....జగపతి బాబు సంచలన వ్యాఖ్యలు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ నటుడు జగపతి బాబు కులం గురించి, తన కూతురు పెళ్లి గురించి చేసిన కామెంట్స్ చర్చనీయాంశం అయ్యాయి. ఆ మధ్య జగపతి బాబు కూతురు అమెరికా శ్వేత జాతీయుడిని ప్రేమించిన పెళ్లాడిన సంగతి తెలిసిందే. కూతురు కోరిక మేరకు జగపతి బాబు అండ్ ఫ్యామిలీ ఈ పెళ్లికి అంగీకరించి అంగరంగ వైభవంగా చేసారు. అయితే జగపతి కూతురు అమెరికా వ్యక్తిని పెళ్లాడటంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేసారట.

జగపతి బాబు ఈ విషయమై మాట్లాడుతూ.....వంశ‌మైన వీర‌మాచ‌నేని అంటే క‌మ్మ కులంలో పెద్ద ఫ్యామిలీ అని అలాంటిది త‌న కుమార్తెకు ఓ అమెరికా అల్లుడితో పెళ్లి జ‌రిపించ‌డం ఏంట‌ని కొంద‌రు నన్ను ప్ర‌శ్నించార‌ు. వారికి నేను ఒకటే చెప్పాను. మా అమ్మాయి..ఆ అబ్బాయి ఇష్ట‌ప‌డ్డారు. పెళ్లి చేస్తున్నాం. ఇందులో కులాల ప్ర‌స్తావ‌న ఎందుకుని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

Jagapathi Babu comments on caste

కులాల గురించి మాట్లాడుకోవడం టైం వేస్ట్ అని జగపతి బాబు అన్నట్లు తెలుస్తోంది. నాకు వారసులు లేరు. నాతోనే వీరమాచినేని వంశీ అంతం అవుతుందని అంటున్నారు. నేను చనిపోయాక ఇక్కడ ఏం జరుగుతుందో నేను చూడను. అయినా ఈ కాలంలో కూడా కులాల ప్ర‌స్తావ‌న అంతా ట్రాష్ అని జగపతి బాబు కొట్టి పారేసినట్లు సమాచారం.

మొత్తానికి జగపతి బాబు వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈ ఆధునిక కాలంలోనూ ఇంకా కులం కుళ్లులో మగ్గుతున్న వారు జగపతి బాబు వ్యాఖ్యలతో మార్పు రావాల్సిన అవసరం ఉందని పలువురు అంటున్నారు. ముఖ్యంగా సినిమా పరిశ్రమలో రెండు కులాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుందనే వాదన ఉంది. ఈ నేపథ్యంలో జగపతి బాబు వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.

English summary
Jagapathi Babu, the man who speaks upright, often stays as introvert as he doesn't believe in friendships and other relations, has recently breathed fire on the castes.
Please Wait while comments are loading...