»   » నాలుగు కోట్లు మోసం చేసారు: మరో వివాదంలో జగపతిబాబు

నాలుగు కోట్లు మోసం చేసారు: మరో వివాదంలో జగపతిబాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu

జగపతి బాబు ఒక హీరోగా ఎంత సంపాదించాడో అంతా పోగొట్టుకున్న స్థాయిలో కూడా మళ్ళీ పైకెదిగిన నటుడు. అయితే ఇన్ని అనుభవాల తర్వాత కూడా జగపతి బాబు మళ్ళీ ఇంకో సారి మోసపోయాడట. ఒకటీ రెండూ కాదు ఏకంగా నాలుగు కోట్ల మేర ఆయన ని ఒక రియల్ ఎస్టేట్ సంస్థ ముంచేసిందట.

4 కోట్లు వసూలు

4 కోట్లు వసూలు

మెట్రో నగరాల్లో ప్రముఖ కన్‌స్ట్రక్షన్ సంస్థగా ఉన్న ‘లోధా' హైదరాబాద్‌లోని కూకట్ పల్లిలో విలాసవంతమైన అపార్ట్‌మెంట్ కట్టిస్తామంటూ ఒక్కొక్కరి దగ్గర రూ.4 కోట్లు వసూలు చేసిందట. 10.5 ఎకరాల భారీ స్థలంలో పూర్తి ప్రైవసీతో, అత్యాధునిక సౌకర్యాలతో, భద్రత ఏర్పాట్లతో ఈ అపార్ట్‌మెంట్ కడతామని చెప్పిందట.

మాట తప్పిది

మాట తప్పిది

కానీ ఆ మాట తప్పి కేవలం మూడు ఎకరాల్లో మాత్రమే అపార్ట్‌మెంట్ నిర్మాణం మొదలుపెట్టిందని.. దీంతో పాటుగా పక్కనే నిర్మిస్తున్న మామూలు అపార్ట్‌మెంట్‌ను ఈ కంపౌండ్‌లోకే కలిపిస్తోందని.. దీంతో తమ ప్రైవసీ, భద్రత మాటేంటని.. మామూలు అపార్ట్‌మెంట్లతో కలిపేట్లయితే.. ఇంత తక్కువ స్థలంలో అపార్ట్‌మెంట్ కట్టేట్లయితే రూ.4 కోట్లు ఎందుకు పెడతామని జగపతిబాబు ప్రశ్నించారు.

నమ్మి మోసపోయారు

నమ్మి మోసపోయారు

తమకు 10.5 ఎకరాల స్థలంలో విలాసవంతమైన ఫ్లాట్లను నిర్మిస్తామని చెప్పి మూడు ఎకరాల్లో మాత్రమే మెరిడియన్ అపార్ట్ మెంట్లు నిర్మించారని జగపతిబాబు ఆరోపించారు. లోధా సంస్థ ప్రచారం చూసి ఎంతో మంది నమ్మి మోసపోయారని జగపతి బాబు పేర్కొన్నారు. సంస్థ తీరు ఇబ్బందికరంగా ఉందని అందుకే తాము రోడ్డెక్కాల్సి వచ్చిందిన తెలిపారు.

స్వేచ్ఛకు భంగం కలిగేలా

స్వేచ్ఛకు భంగం కలిగేలా

జీహెచ్ ఎంసీ నిబంధనలకు విరుద్ధంగా కాంపౌండ్ వాల్ నిర్మించారని జగపతి బాబు ఆరోపించారు. తమ స్వేచ్ఛకు భంగం కలిగేలా వ్యవహరించడమే కాకుండా నిబంధనలు ఉల్లంఘించిన లోధా సంస్థ పై జీహెచ్ ఎంసీ వర్గాలకు ఫిర్యాదు చేయనున్నట్లు జగపతి బాబు స్పష్టం చేశారు.

నిబంధనల్ని ఉల్లంఘించి

నిబంధనల్ని ఉల్లంఘించి

జీహెచ్ఎంసీ నిబంధనల్ని కూడా ఉల్లంఘించి అపార్ట్‌మెంట్ కడుతున్నారని.. ప్రహరీ గోడ నిర్మాణంలోనూ అక్రమాలున్నాయని తమకు తెలిసిందని.. దీంతో తాము రోడ్డెక్కాల్సి వచ్చిందని.. ఈ విషయంలో జీహెచ్ఎంసీ అధికారులు జోక్యం చేసుకోవాలని జగపతిబాబు కోరారు. తమ డబ్బులు వెనక్కి ఇచ్చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ వ్యవహారాన్ని తేలిగ్గా వదిలిపెట్టబోమన్నారు. జగపతిబాబుతో పాటు డబ్బులు కట్టిన పలువురు వీఐపీలు ఈ అపార్ట్‌మెంట్ దగ్గరికొచ్చి నిరసన వ్యక్తం చేశారు.

English summary
agapathi Babu, who owns a flat in Lodha Apartments located near Kukatpally Housing Board, raised objection over the demolition of the wall that divides the adjacent Meridian apartments.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu