జగపతి బాబు లేకపోతే నేను లేను...దిల్ రాజు

By Srikanya

జగపతి బాబుతో నా ప్రయాణం సుదీర్ఘమైనది. ఆయన 'పెళ్లి పందిరి' సినిమా లేకపోతే నేను లేను. ఆ తర్వాత మా 'ఆకాశమంత'లో జగపతిబాబు నటించారు. 2012లో ఆయన హీరోగా ఓ సినిమాను నిర్మించబోతున్నా. ఇప్పటికే స్క్రిప్ట్‌ పనులు మొదలయ్యాయంటూ ప్రముఖ నిర్మాత దిల్ రాజు చెప్పుకొచ్చారు.జగపతిబాబు తాజా చిత్రం 'కీ' ట్రైలర్స్ ఆవిష్కరణ రీసెంట్ గా హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిధిగా దిల్ రాజు హాజరై ఇలా స్పందించారు. అనంతరం...జగపతి బాబు మాట్లాడుతూ ''ఒక్క ముక్క కూడా నాతో చెప్పించుకోకుండా చిత్రాన్ని తీర్చిదిద్దాడు దర్శకుడు. ఈ కథ చెప్పినప్పుడే నాకు ఈ చిత్ర బృందంపై నమ్మకం కలిగింది. భిన్నమైన నేపథ్యంతో తెరకెక్కిన చిత్రమిది. ఇలాంటి చిత్రాలు మరిన్ని రూపుదిద్దుకోవాలని అన్నారు. స్వప్న, దీప్తిబాజ్‌పాయ్‌ ముఖ్య పాత్రధారులుగా చేస్తున్న ఈ చిత్రానికి నాగేంద్రప్రసాద్‌ దర్శకుడు. సుకుమార్‌ రెడ్డి నిర్మాత . ఏప్రిల్‌ రెండో వారంలో చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X