»   »  నిర్మాతగా మారుతున్న జగపతి బాబు

నిర్మాతగా మారుతున్న జగపతి బాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఒకప్పుడు తెలుగు తెరపై రొమాంటిక్ హీరోగా, ఫ్యామిలీ హీరోగా, ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడి పాత్రల్లో ఓ వెలుగు వెలిగిన జగపతి బాబు ప్రస్తుతం హీరో పాత్రలు మానేసి క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ పాత్రల్లో తన సత్తా చాటుతున్నారు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే జగపతి బాబు త్వరలో నిర్మాతగా మారబోతున్నారు. వచ్చే నెలలో తన పుట్టినరోజు సందర్భంగా జగపతి బాబు ఈ విషయమై అఫీషియల్ ప్రకటన చేయబోతున్నట్లు సమాచారం.

జగపతి బాబు తండ్రి విబి రాజేంద్రప్రసాద్ ప్రముఖ నిర్మాత. జగపతి ఆర్ట్స్ పిక్చర్స్ బేనర్లో తెలుగులో పలువురు స్టార్ హీరోలతో సినిమాలు చేసారు. అయితే క్రమ క్రమంగా వాళ్ల ఫ్యామిలీ ఆర్థిక కష్టాల్లో పడింది. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ లోని తమ ఇంటిని కూడా అమ్ముకున్నారు. తండ్రి నిర్మాతగా ఉన్నపుడే జగపతి బాబు నటుడిగా నిలదొక్కుకున్నాడు. ప్రస్తుతం జగపతి బాబు ఆర్థికంగా నిలదొక్కుకోవడంతో తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ నిర్మాతగా మారేందుకు ప్రయత్నిస్తున్నారు.

Jagapathi Babu launching his production house

అయితే తండ్రి సినిమాలు చేసిన బేనర్ ను మళ్లీ రీలాంచ్ చేసే ఆలోచన జగపతి బాబుకు లేదని, కొత్త బేనర్ ప్రారంభించే ఆలోచనలో ఉన్నారని, ‘క్లిక్ సినీ కార్ట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్' పేరుతో సంస్థను స్థాపించే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఇదే పేరు ఫైనల్ చేస్తారా? మరేదైనా కొత్త పేరు పెడతారా? అనేది త్వరలోనే ఆయన తెలియజేస్తారని టాక్.

లెజెండ్ సినిమాతో విలన్ గా టర్న్ అయిన తర్వాత జగపతి బాబు దశ తిరిగిందనే చెప్పాలి. ఈ సినిమాలో ఆయనకు విలన్ గా మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత వరుస అవకాశాలతో దూసుకెళ్లారు. మహేష్ బాబు ‘శ్రీమంతుడు'లో హీరో తండ్రి పాత్రలో అదరగొట్టారు. తాజాగా విడుదలైన ‘నాన్నకు ప్రేమతో' చిత్రంలో విలన్ గా సత్తా చాటారు. ప్రస్తుతం ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.

English summary
Actor Jagapathi Babu is all set to turn as producer. The versatile actor will be launching his production house soon. An official announcement regarding the same would be made next month on the eve of his birthday.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu