»   » బోయ‌పాటి శ్రీను, బెల్లంకొండ శ్రీనివాస్ చిత్రంలో జ‌గ‌ప‌తిబాబు

బోయ‌పాటి శ్రీను, బెల్లంకొండ శ్రీనివాస్ చిత్రంలో జ‌గ‌ప‌తిబాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఎన్నో విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్న స్ట‌యిలిష్ యాక్ట‌ర్ జ‌గ‌ప‌తిబాబు మ‌రో డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్‌లో న‌టించ‌నున్నారు. సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను, యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కాంబినేష‌న్‌లోద్వార‌క క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి నిర్మిస్తున్న తాజా చిత్రం ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది.

స‌రైనోడు వంటి ఇండ‌స్ట్రీరీ హిట్ త‌ర్వాత డైరెక్ట‌ర్ బోయపాటిశ్రీను ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ప్ర‌స్తుతం విశాఖ‌ప‌ట్నంలో సెకండ్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. ఈ చిత్రంలో త‌మిళ స్టార్ శ‌ర‌త్‌కుమార్ ఓ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు మ‌రో కీల‌క పాత్ర‌లోజ‌గ‌ప‌తిబాబు న‌టిస్తున్నారు.

Jagapathi Babu Makeover In Boyapati Srinu next movie

ఈ సంద‌ర్భంగా..నిర్మాత మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి మాట్లాడుతూ - బోయ‌పాటిగారి ద‌ర్శ‌క‌త్వంలో జ‌గ‌ప‌తిబాబుగారు లెజెండ్‌లో పోషించిన విల‌న్ క్యారెక్ట‌ర్ ఆయన కెరీర్‌లోనే గుర్తుండిపోతుంది. లెజెండ్ త‌ర్వాత బోయ‌పాటి, జ‌గ‌ప‌తిబాబు కాంబోలో వ‌స్తున్న ఈ చిత్రంతో జ‌గ‌ప‌తిబాబుగారి క్రేజ్ నెక్ట్స్ లెవ‌ల్‌కు చేరుతుంది. జ‌గ‌ప‌తిబాబుగారి కోసం బోయ‌పాటి శ్రీనుగారు మ‌రోసారి ప‌వ‌ర్‌ఫుల్ క్యారెక్ట‌ర్‌ను క్రియేట్ చేశారు. విశాఖపట్నంలో జ‌రుగుతున్న రెండో షెడ్యూల్‌లో బెల్లంకొండ సాయిశ్రీనివాస్, ప్ర‌గ్యాజైశ్వాల్‌ల‌తో పాటు జ‌గ‌ప‌తిబాబుల‌పై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు అన్నారు.

బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌, ర‌కుల్ ప్రీత్‌సింగ్‌, ప్ర‌గ్యాజైశ్వాల్ హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్ః సాహి సురేష్‌, ఎడిట‌ర్ః కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు, ఫైట్స్ః రామ్‌లక్ష్మ‌ణ్‌, మాటలుః ఎం.ర‌త్నం, సినిమాటోగ్ర‌ఫీః రిషి పంజాబి, మ్యూజిక్ః దేవిశ్రీప్ర‌సాద్‌, నిర్మాతః మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి, క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వంః బోయ‌పాటి శ్రీను.

English summary
Stylish and flexible artist Jagapathi Babu is all set for one more stylish makeover. Sensational director Boypati Srinu and young hero Bellamkonda Sai Srinivas new movie produced on Dwaraka Creations by Miryala Ravinder Reddy is currently in the second schedule shooting in Visakhapatnam.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu