»   » పాపం .. ‘గాయం-2’ దెబ్బకి జగపతి బాబు అలా...

పాపం .. ‘గాయం-2’ దెబ్బకి జగపతి బాబు అలా...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హీరో జగపతి బాబు 'గాయం-2" లో తన సరసన నటించిన విమలారామన్‌ను వెంటబెట్టుకుని హైదరాబాద్ లోని అపార్ట్ ‌మెంట్స్‌ చుట్టూ తిరుగుతున్నారు. రెండు వారాల క్రితం రిలీజైన గాయం-2" మంచి విజయం సాధిస్తోందని అందుకునే..వినాయకచవితి, రంజాన్‌ పండుగలను పురస్కరించుకుని ఇలా హైదరాబాద్ ‌లోని పలు ప్రాంతాలను సందర్శించి అపార్ట్‌ మెంట్ ‌వాసులను పలకరిస్తున్నామంటున్నారు. ఇక జగపతి బాబు, విమల రామన్ ప్రత్యక్ష్యంగా తమ ఇంటికి విచ్చేయడంతో అపార్ట్ ‌మెంట్ ‌వాసులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బు అయ్యారు. పలువురి ఇళ్లను సందర్శించి ప్రసాదాలు సైతం ఆయన పుచ్చుకున్నారు. అంతేకాదు..తను సందర్శించిన అపార్ట్‌ మెంట్ ‌లోని పెద్దలకు, పిల్లలకు కానుకలందించారు. ఇక ఈ పర్యటనలో భాగంగా...'గాయం-2" చిత్రంలో ఎవరెవరికి ఏం నచ్చిందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసారు జగపతి బాబు. అయితే తాము గాయం 2 చూడలేదని, 'శుభలగ్నం", 'మావిచిగురు", 'సర్దుకుపోదాం రండి" వంటి చిత్రాలు తమకెంతో ఇష్టమని, టీవీలో ఎప్పుడొచ్చినా మిస్సవ్వకుండా మళ్లీ మళ్లీ చూస్తామని వెల్లడించారు. ఇక గాయం 2 చిత్రం జగపతి బాబు సొంత డబ్బుతో వేరే వారిని నిర్మాతగా పెట్టి చేయటంతో ఎట్లా అయినా నిలబెట్టాలని విశ్వప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పటికే సినిమా బాగోలేదని అంతటా స్ప్రెడ్ అయిన ఈ స్ధితిలో ఎంతవరకూ ఈ ప్రమోషన్ పనికొస్తుందో చూడాలి.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu