»   »  'సూర్యాకాంతం' గా రమ్యకృష్ణ?

'సూర్యాకాంతం' గా రమ్యకృష్ణ?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Ramya Krishna
ఆంధ్రుల అభిమాన గయ్యాళి అత్తగారు సూర్యాకాంతం ను తెలుగు చిత్ర సీమ ఉన్నంత కాలం మరవటం జరగదు. ఇప్పుడు అదే టైటిల్ తో అదే తరహా పాత్రతో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. టైటిల్ రోల్ ని రమ్యకృష్ణ పోషించనుంది. ఇక ఆమెకి జోడీగా జగపతిబాబు కనిపిస్తారు. జగపతి సంస్ధ అక్కినేని హీరోగా నిర్మించి హిట్ కొట్టిన 'దసరాబుల్లోడు'లో ఎస్వీఆర్..సూర్యాకాంతం పాత్రలను అనుసరించి కథనం రూపొందించారని తెలుస్తోంది. ఇక జగపతిబాబు ప్రస్తుతం యాక్షన్ సినిమాలంటూ ప్రక్కకు వచ్చినా ఆయన కెరీర్ లో పెద్ద హిట్టులు అనిపించుకున్న చిత్రాలన్నీ ఫ్యామిలీ ఎంటర్ టైనర్సే కావటం గమనార్హం.

అలాగే రాజశేఖర్ చేసిన 'గోరింటాకు' సినిమాలో అన్నయ్య పాత్రను జగపతిబాబు చేత చేయించాలని అప్పట్లో నిర్మాతలు సంప్రదించటం జర్గింది. అయితే జగపతిబాబు దానికి ఒఫ్పుకోలేదు. అయితే ఇప్పుడు 'కథానాయకుడు' పరాజయం ఆయనని తిరిగి ఆలోచించుకునేలా చేసిందని సమాచారం. అందులోనూ ఇప్పుడాయన 'బంగారుబాబు' అనే సెంటిమెంటు చిత్రాన్ని చేస్తున్నారు. ఇక ఈ 'సూర్యాకాంతం' సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పటికీ గ్లామర్ తగ్గకుండా సెక్సీ లుక్స్ తో కనిపించే రమ్యకృష్ణ సూర్యాకాంతం పాత్రలో ఇమడగలదా అన్నది కొందరి సందేహం. అయితే ఆ మాత్రం ఆలోచించకుండా ప్రాజెక్టు ప్రారంభించరు కదా....

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X