»   » ‘చట్టం’...నీ అబ్బ సొత్తా? నిలదీస్తున్న జగపతి బాబు

‘చట్టం’...నీ అబ్బ సొత్తా? నిలదీస్తున్న జగపతి బాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu

జగపతి బాబు, మదాల్సశర్మ జంటగా 'చట్టం" (నీ అబ్బ సొత్తా?) చిత్రం రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. విశాఖ టాకీస్ పతాకంపై పి.ఎ అరుణ్‌ ప్రసాద్ దర్శకత్వంలో నట్టికుమార్, తుమ్మేపల్లి రామ సత్యనారాయణ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఇది. ముహూర్తపు సన్నివేశానికి డా.డి.రామానాయుడు క్లాప్ ‌నివ్వగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కె.కవిత కెమెరాస్విచాన్ చేసారు. ఈ సందర్భంగా దర్శకుడు అరుణ్‌ ప్రసాద్ మాట్లాడుతూ...ఈ చిత్రానికి ఇది యాప్ట్ టైటిల్. మన చట్టాల పట్ల అందరిలోనూ ఎన్నో ప్రశ్నలున్నాయి. అవి సరిగా అమలుకావనీ, నేరస్తులకు శిక్షలు పడవనీ, వారు దర్జాగా తప్పించుకు తిరుగుతుంటారనీ అనుకుంటుంటాం. అలాంటి స్థితిలో తప్పు చేసినవాడికి అప్పటికప్పుడు సరైన శిక్ష పడేలా చేయాలనుకునే ఓ పోలీసాఫీసర్ కథ ఈ సినిమా అని తెలిపారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ చిత్రపరిశ్రమకి మేం వ్యతిరేకం కాదు. సినిమా వ్యాపారులేకాదు, ఇతర రంగాల వారెవరైనా మా భావాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే మాత్రం సహించం, సినిమా ఇండస్ట్రీ ఇక్కడ, అక్కడా పెరగాలని కోరుకుంటున్నామన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X