»   » ఇక్కడ నేను చేసిందే అక్కడ అమితాబ్ చేస్తున్నాడు: జగపతి బాబు

ఇక్కడ నేను చేసిందే అక్కడ అమితాబ్ చేస్తున్నాడు: జగపతి బాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu

జగపతి బాబు గొంతు అరువు ఇచ్చిన బిగ్ ఎఫ్ జీ అనే హాలీవుడ్ సినిమా తెలుగు లో డబ్బింగ్ అయ్యి విడుదల కి సిద్దం గా ఉంది. ఒకప్పుడు జగపతి బాబు వాయిస్ ని చాలా మంది బాలేదు అన్నారట, కెరీర్ మొదట్లో తన వాయిస్ ని బాలేదు అంటూ ఉంటె ఆశ్చర్యంగా ఉండేది అంటున్నారు జగపతి బాబు. కొందరైతే నీ వాయిస్ విలకి సరిపోతుంది హీరో కి కాదు అంటూ నవ్వేవాళ్ళట.

ఈ చిత్రం జూలైలో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంది. ఈ సంద‌ర్భంగా శ‌నివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో.... జ‌గ‌ప‌తి బాబు మాట్లాడుతూ స్పీల్ బ‌ర్గ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ హాలీవుడ్ చిత్రానికి న‌న్ను డ‌బ్బింగ్ చెప్ప‌మ‌న్న‌ప్పుడు చాలా ఎగ్జ‌యిట్ అయ్యాను. చాలా హ్యాపీగా ఒప్పుకున్నాను.

" హీరో అయిన తరవాత కూడా చాలా కాలం పాటు నా గొంతు బాలేదు అనే వారు దాంతో వేరే వాళ్ళ మీద ఆధారపడాల్సి వచ్చింది నాకు. వేరే వారి గొంతు మీద ఆధారపడడం ఇబ్బందిగా అనిపించేది. కానీ కొన్నాళ్ళ తరవాత రామ్ గోపాల్ వర్మ మాత్రం నేనే వాయిస్ ని ఇవ్వాలి అని గాయం సినిమా టైం లో మొండిగా పట్టు బట్టి కూర్చున్నారు.

Jagapathi Babu speaking about the dubbing experience of The BFG

ప్రొడ్యూసర్ లు కూడా ఒద్దు అంటున్నా వినకుండా ఆయన తన పట్టు వదలలేదు. దాంతో గాయం సినిమాకి మొట్టమొదటి సారిగా నేనే డబ్బింగ్ చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సినిమాకి డబ్బింగ్ చెప్పడం కోసం హాలీవుడ్ వారు సైతం నన్ను అడిగారు అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఆ తరవాత కాలం లో నా గొంతు నాకు చక్కగా సూట్ అయ్యింది. ఆరోజు వర్మ గనక నామీద నాకు నమ్మకం పెంచకపోయి ఉంటె ఎమయ్యేవాన్నొ" అంటూ తన మనసులో మాటని చెప్పాడు.

"ఇలాంటి ఓ డిఫరెంట్ వాయిస్ ఎలా ఇచ్చానో తెలియ‌దు కానీ ఓ మ్యాజిక్‌లా జ‌రిగిపోయింది. నా వాయిస్ వింటే నాకు కొత్తగా అనిపిస్తుంది. బాలీవుడ్‌లో అమితాబ్ ఈ పాత్ర‌కు డబ్బింగ్ చెప్పారు. ఆయ‌న డ‌బ్బింగ్ చెప్పిన పాత్ర‌కు నేను తెలుగులో డ‌బ్బింగ్ చెప్ప‌డం ఓ ప్రివిలేజ్‌గా భావిస్తున్నాను. నా కెరీర్ స్టార్టింగ్‌లో నాకే వేరే వాళ్ళు డ‌బ్బింగ్ చెప్పేవాళ్ళు.

ఇప్పుడు నేను వేరే పాత్ర‌ల‌కు డ‌బ్బింగ్ చెప్ప‌డం అనేది ఓ మంచి అనుభూతినిచ్చింద‌ని మాత్రం చెప్ప‌గ‌ల‌ను. రాంగోపాల్‌వ‌ర్మ గుర్తించ‌నంతవ‌ర‌కు నా వాయిస్‌ను ఎవ‌రూ గుర్తించ‌లేక‌పోయారు" అంటూ కాస్త ఎగ్జట్ గానే మాట్లాడాడు ఈ విలనీహీరో జగపతి బాబు తెలుగు లో జగపతిబాబు డబ్బింగ్ చెప్పిన పాత్రకి హిందీ లో అమితాబ్ బచ్చన్ కూడా చెప్పడం విశేషం.

English summary
Jagapathi Babu speaking about the dubbing experience of The BFG. Jagapathi babu gave voice (Dubbing) to one of the character of The BFG. "Steven Spielberg is a big name in the Hollywood Industry and to be associated with a film that he has made is truly an honor for me. Big B Amitabh has dubbed for this role in Hindi and I have done it in Telugu. I thank the team of Reliance for this and I am grateful to Telugu movie lovers and the media" said Jagapati Babu
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu