»   » ఎన్టీఆర్ కే తప్పలేదు నేనెంత...జగపతి బాబు

ఎన్టీఆర్ కే తప్పలేదు నేనెంత...జగపతి బాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చూడండీ..నేను టైమ్‌ని నమ్ముతాను. మహానటుడు ఎన్టీరామారావు గారికే తప్పలేదు ఒడిదుడుకులు...నేనెంత చెప్పండి..అంటున్నారు జగపతి బాబు. వరస ప్లాపుల్లో ఉన్న ఆయన రీసెంట్ గా గాయం సీక్వెల్ చేసారు. త్వరలో రిలీజ్ కానున్న ఈ చిత్రం ప్రమేషన్ లో భాగంగా కలిసిన మీడియాతో మాట్లాడుతూ కెరీర్ గురించి ఇలా స్పందించారు. అలాగే...నాకు హీరోయిజాన్ని తెచ్చిపెట్టిన సినిమా 'గాయం'. 'పెద్దరికం'లో నేను చేసిన ఓ ఎమోషనల్‌ సన్నివేశం చూసి 'గాయం'లో దుర్గ పాత్రకు రామ్‌ గోపాల్‌ వర్మ నన్ను ఎంపిక చేశారు. అప్పటిదాకా ఒడిదుడుకులతో సాగుతున్న నా కెరీర్‌ ఒక్కసారిగా ఆ సినిమాతో స్పీడందుకుంది. మళ్లీ ఇప్పుడు నా కెరీర్‌ స్లంప్‌లో ఉంది. అలాంటి టైమ్‌లో వస్తున్న ఈ 'గాయం-2' మళ్లీ నాకు పూర్వవైభవం తెస్తుందని నా నమ్మకం అంటూ తన ఈ చిత్రం విజయం పై తన విశ్వాసాన్ని వ్యక్తం చేసారు. 'గాయం-2' చిత్రం వచ్చేనెల 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Please Wait while comments are loading...