గుండు కొట్టిస్తామన్నవారు క్షమాపణ చెప్పారు: జగపతి బాబు
జగపతి బాబు కీలకపాత్రలో చేసిన 'జై భోలో తెలంగాణా' చిత్రం విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.అయితే విడుదల సమయంలో ఈ చిత్రంలో నటించినందకు జగపతిబాబుకి గుండు కొట్టిస్తామంటూ ప్రకటనలు చేసారు. దీనిపై చిత్రం విడుదలైన తర్వాత జగపతిబాబు స్పందించారు. ఆయన మాటల్లోనే...దర్శకుడు శంకర్ వచ్చి 'జై భోలో తెలంగాణా' లో నటించమని అడిగినప్పుడు మొదట్లో ఆలోచించాను. కానీ కళాకారునిగా అన్ని అన్ని తారగా పాత్రలు చేయాలనే ఉద్దేశంతో అందులో నటించాను.
ఇందులో నా నోటి నుంచి ఏ ప్రాంతాన్ని కించపరచే విధంగా సంభాషణలు లేకుండా జాగ్రత్త పడ్డాను. ఆ సినిమాలో నేను చేసినందుకు తిరుపతిలోనాకు గుండు కొట్టిస్తానని అన్నారు. సినిమా విడుదల తర్వాత వారు నన్ను కలిసి క్షమాపణలు చెప్పారు అన్నారు.ప్రస్తుతం జగపతిబాబు...చట్టం, నగరం నిద్ర పోతున్న వేళ, క్షేత్రం, కీ చిత్రాల్లో నటిస్తున్నారు. ఆయన తన పుట్టినరోజుని శనివారం జరుపుకున్నారు.


Click it and Unblock the Notifications











