»   » నేను మూర్ఖుడిని.. ఎవ్వరినీ వదలను: జగపతిబాబు ఉద్వేగంగా మాట్లాడాడు

నేను మూర్ఖుడిని.. ఎవ్వరినీ వదలను: జగపతిబాబు ఉద్వేగంగా మాట్లాడాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

జయ జానకి నాయక సినిమా సక్సెస్ మీట్ హంసలదీవిలో జరిగింది.కృష్ణా జిల్లా అవనిగడ్డ నుండి 25 కిలోమీటర్ల దూరంగా ఉన్న హంసలదీవిలో ''జయ జానకి నాయక'' సినిమాకు సంబంధించి ఒక ఫైట్ తీశారు బోయపాటి శ్రీను. అందుకే అదేపనిగా ఆ ఫైట్ తీసిన స్థానంలోనే ఈ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది చిత్రబృందం.

ఈ సందర్భంగా హీరో, విలన్ జగపతిబాబు అందరూ బాగున్నారా అంటూ ప్రసంగం ప్రారంభించారు."30ఏళ్లుగా నన్ను భరిస్తున్నందకు ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు" అంటూ అభిమానులను ఉద్దేశించి జగపతిబాబు మాట్లాడారు. ఈ మాట అన్నప్పుడు అభిమానులంతా జై జగపతి అంటూ నినాదాలతో హెరెత్తించారు.

jagapati babu speech at Jaya Janaki Nayaka succes meet

అభిమానులకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదన్న జగపతిబాబు . " భార్య అమ్మేసినా ఒప్పుకున్నారు.. హీరోయిన్‌ను చంపేసినా ఒప్పుకున్నారు.. మీ హార్ట్స్‌కు నా హార్ట్ ఎప్పుడూ క్లోజ్‌గానే ఉంటుంది" అంటూ ఉద్వేగంగా ప్రసంగించాడు. "లెజెండ్ మూవీకి ముందు జగపతిబాబు అయిపోయాడు ఇక మార్కెట్‌లో లేడు .. వెళ్లిపోయాడు అన్నారు.

Public talk on "Jaya Janaki Nayaka"| Filmibeat Telugu

నేనెక్కడికీ వెళ్లను.. మీతోనే ఉంటాను. లెజెండ్‌లో బోయపాటి తనను ఓ మొండోడిగా పెట్టాడు.. నేను పరమ మొండోడిని.. పరమ మూర్ఖుడిని.. వదలను.. ఈ ఇండస్ట్రీని.. సినిమాలను.. మిమ్మల్నెవ్వరినీ వదలను." అని జగపతి మాట్లాడుతుంటే ఫ్యాన్స్ క్లాప్స్‌తో మారుమోగించారు. ఆయన మాట్లాడుతున్నంత సేపు జగపతి అంటూ నినాదాలతో హోరెత్తించారు.

English summary
Jagapathi Babu stated that he would not leave the film industry and expressed that Boyapati has come to his rescue by making him sit on throne in the industry.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu