»   » మాజీ ప్రధాని మనవడి పాటల విడుదల : సెప్టెంబర్‌ 18న నిఖిల్‌ కుమార్‌ 'జాగ్వార్‌' ఆడియో ...

మాజీ ప్రధాని మనవడి పాటల విడుదల : సెప్టెంబర్‌ 18న నిఖిల్‌ కుమార్‌ 'జాగ్వార్‌' ఆడియో ...

Posted By:
Subscribe to Filmibeat Telugu

మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, డిస్ట్రిబ్యూ టర్‌, ప్రముఖ నిర్మాత హెచ్‌.డి.కుమారస్వామి తనయుడు నిఖిల్‌కుమార్‌ని హీరోగా పరిచయం చేస్తూ 75 కోట్ల భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్‌ వేల్యూస్‌తో శ్రీమతి అనితా కుమారస్వామి నిర్మిస్తున్న చిత్రం 'జాగ్వార్‌'. హెచ్‌.డి. కుమారస్వామి సమర్పణలో చన్నాంబిక ఫిలింస్‌ పతాకంపై రాజమౌళి శిష్యుడు ఎ.మహదేవ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'జాగ్వార్‌'.

ఈ చిత్ర విశేషాలను సమర్పకులు హెచ్‌.డి.కుమారస్వామి తెలియజేస్తూ - ''ఈ చిత్రం తాజా షెడ్యూల్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇండస్ట్రీలో వున్న టాప్‌ టెక్నీషియన్స్‌, ఆర్టిస్ట్‌లు ఈ చిత్రానికి వర్క్‌ చేస్తున్నారు. తమన్నా స్పెషల్‌ సాంగ్‌ ఈ సినిమాకి హైలైట్‌ కానుంది.


"Jaguar" Movie Audio To Be Launched On this September 18

ఎన్నో సూపర్‌డూపర్‌ హిట్‌ చిత్రాలకి మ్యూజిక్‌ చేసిన సక్సెస్‌ఫుల్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ థమన్‌ ఈ చిత్రానికి ఎక్స్‌ట్రార్డినరీ మ్యూజిక్‌ని అందించారు. రామ జోగయ్య శాస్త్రి ఈ చిత్రంలో అన్ని పాటల్ని ఒకదాన్ని మంచి మరొకటి అద్భుతంగా వుండేలా రాశారు. ఈ చిత్రం ఆడియోను సెప్టెంబర్‌ 18న సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో విడుదల చేయబోతున్నాం ..


ప్రముఖ తారాగణంతో 75 కోట్ల భారీ బడ్జెట్‌తో ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా ప్రేక్షకులందరికీ నచ్చేవిధంగా అన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ని జోడించి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు పూర్తి చేసి దసరా కానుకగా అక్టోబర్‌ 6న వరల్డ్‌వైడ్‌గా 'జాగ్వార్‌' చిత్రాన్ని రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అన్నారు.


"Jaguar" Movie Audio To Be Launched On this September 18

జగపతిబాబు, రఘుబాబు, బ్రహ్మానందం, సంపత్‌, ఆదిత్యమీనన్‌, భజ్రంగ్‌ లోకేష్‌, అవినాష్‌, వినాయక్‌ జోషి, ప్రశాంత్‌, సుప్రీత్‌ రెడ్డి, రావు రమేష్‌, రమ్యకృష్ణ తదితరులు నటించిన ఈ చిత్రానికి సమర్పణ: హెచ్‌.డి. కుమారస్వామి, కథ: విజయేంద్ర ప్రసాద్‌, సినిమాటోగ్రఫి: మనోజ్‌ పరమహంస, మ్యూజిక్‌: యస్‌.యస్‌. థమన్‌, ఆర్ట్‌: నారాయణరెడ్డి, సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి, ఫైట్స్‌: రవివర్మ, రామ్‌-లక్ష్మణ్‌, కలోయాన్‌ (బల్గేరియా), సెల్వ, కో డైరెక్టర్‌: అమ్మినేని మాధవసాయి, నిర్మాత: శ్రీమతి అనితా కుమారస్వామి, స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: ఎ. మహదేవ్‌.

English summary
The movie makers of the upcoming bilingual movie Jaguar had locked the audio launch date on of the movie 18th sep. The movie is made simultaneously in Telugu and Kannada.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu