For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మాజీ ప్రధాని మనవడా మజాకా! టీజర్ అదిరింది (ఫోటోస్, టీజర్)

  By Bojja Kumar
  |

  నిఖిల్‌ కుమార్‌ హీరోగా హెచ్‌.డి. కుమారస్వామి సమర్పణలో చన్నాంబిక ఫిలింస్‌ బ్యానర్‌పై ఎ.మహాదేవ్‌ దర్శకత్వంలో అనితా కుమారస్వామి నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం 'జాగ్వార్‌'. ఈ నిఖిల్ కుమార్ ఎవరో కాదు... మాజీ ప్రధాని, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి దేవెగౌడ మనవడు, కన్నడంలో అనేక సూపర్‌హిట్‌ చిత్రాలు నిర్మించిన హెచ్‌.డి. కుమారస్వామి తనయుడు.

  75 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను కన్నడతో పాటు తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. నిఖిల్ కుమార్ తండ్రే నిర్మాత కావడంతో ఖర్చుకు ఏమాత్రం వెనకాడటం లేదు. టీజర్ రిలీజ్ కార్యక్రమం కూడా హైదరాబాద్ లో ప్రముఖుల మధ్య గ్రాండ్ గా నిర్వహించారు.

  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టి.సుబ్బరామిరెడ్డి, అల్లు అరవింద్‌, గంటాశ్రీనివాసరావు ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

  రామజౌళి తండ్రి, బాహుబలికి కథను అందించిన విజయేంద్రప్రసాద్‌ ఈ సినిమాకు కథ అందించారు. జగపతిబాబు సిబిఐ ఆఫీసర్‌ పాత్ర పోషిస్తున్నారు. థమన్‌, మనోజ్‌ పరమహంస వంటి టాప్‌ టెక్నీషియన్స్‌ వర్క్‌ చేశారు.

  నిర్మాత హెచ్‌.డి. కుమారస్వామి మాట్లాడుతూ ''నా జీవితంలో ఇది చాలా సంతోషకరమైన రోజు. నేను కన్నడంలో రాజ్‌కుమార్‌, విష్ణువర్ధన్‌, తెలుగులో ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌గారి సినిమాలు చూస్తూ పెరిగాను. నేను ఎగ్జిబిటర్‌గా ఇండస్ట్రీలో ఎంటర్‌ అయి డిస్ట్రిబ్యూటర్‌గా మారి ప్రొడ్యూసర్‌ అయ్యాను. వంద సినిమాలను డిస్ట్రిబ్యూట్‌ చేశాను. తర్వాత తెలుగు నిర్మాతలు కన్నడలో సినిమాలు చేసినపుడు విడుదల సమయంలో నావంతు సపోర్ట్‌ చేశాను. 2004లో 'చంద్ర చకోరి' నిర్మాతగా నేను చేసిన చివరి చిత్రం. తర్వాత ఈ చిత్రం చేస్తున్నాను అన్నారు.

  స్లైడ్ షోలో సినిమాకు సంబంధించిన టీజర్, మరిన్ని వివరాలు...

  విజయేంద్రప్రసాద్ గారే..

  విజయేంద్రప్రసాద్ గారే..

  ఈ సినిమాని తెలుగులో చేయడానికి కారణం విజయేంద్రప్రసాద్‌గారు. కథ చెప్పడానికి వచ్చిన ఆయన కన్నడలోనే సినిమా ఎందుకు చేస్తున్నారు? తెలుగులో కూడా చేయండి. మీ అబ్బాయి మంచి హీరో అవుతాడని ఆయన అన్న మాటతో ఈ సినిమాను కన్నడ, తెలుగులో చేస్తున్నాను.

  బెస్ట్ మూవీ

  బెస్ట్ మూవీ

  దర్శకుడు మహదేవ్‌ బాగా కష్టపడ్డాడు. సినిమా చాలా బాగా వచ్చింది. తెలుగు ప్రేక్షకులు నా బిడ్డని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. 2016లో విడుదలయ్యే సినిమాల్లో ఇది బెస్ట్‌ మూవీగా నిలుస్తుంది అన్నారు.

  హీరో నిఖిల్‌కుమార్‌ మాట్లాడుతూ

  హీరో నిఖిల్‌కుమార్‌ మాట్లాడుతూ

  నాకు తెలుగంటే ఇష్టం. ఎక్కువగా తెలుగు సినిమాలను చూస్తుంటాను. విజయేంద్ర ప్రసాద్‌గారు మా నాన్నగారిని కలవడానికి వచ్చినపుడు మీ అబ్బాయిని మా అబ్బాయి అనుకుని నా చేతుల్లో పెట్టండి అన్నారు. అది నాకిప్పటికీ గుర్తే. అలా మంచి కథను సిద్ధం చేశారు. మా నాన్నగారు నాకోసం ఎంతో చేశారు. ఆయనకు నేను ఏం చేసినా తక్కువే అవుతుంది అన్నారు.

  జగపతిబాబు మాట్లాడుతూ

  జగపతిబాబు మాట్లాడుతూ

  ''తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంటరై పెద్ద నిర్మాతగా ఎదగాలని, కుమారుడ్ని పెద్ద హీరో చేయాలనే తపన కుమారస్వామి గారిలో కనబడుతోంది. ఓ సందర్భంలో నిఖిల్‌ గురించి అడిగినపుడు రాష్ట్రం కోసం ఎంతో చేశాను. నా కొడుకు కోసం ఈమాత్రం చేయలేనా అన్నారు. ఈ సినిమాకు హాలీవుడ్‌ టెక్నీషియన్స్‌ కూడా పనిచేశారు. ఇలాంటి సినిమాలో నేను పార్ట్‌ కావడాన్ని ప్రివిలేజ్‌గా భావిస్తున్నాను'' అన్నారు.

  విజయేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ

  విజయేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ

  విజయేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ - ''మొదటిసారి నన్ను పిలిచి కథ రాయమన్నప్పుడు ఏం రాద్దాంలే అనుకున్నాను. నిఖిల్‌కి సంబంధించిన ఒక వీడియో క్లిప్‌ చూశాక తనలో స్పార్క్‌ చూసి తను ఒక డైమండ్‌ అని అర్ధమైంది. నాపై నమ్మకంతో నిఖిల్‌ను నాకు అప్పగించారు. మహదేవ్‌ సినిమాని కష్టపడి తెరకెక్కిస్తున్నాడు. ఆల్‌ ది బెస్ట్‌'' అన్నారు.

  నటీనటులు

  నటీనటులు

  నిఖిల్‌కుమార్‌, దీప్తి జంటగా నటించిన ఈ చిత్రంలో జగపతిబాబు, రఘుబాబు, బ్రహ్మానందం, సంపత్‌, ఆదిత్యమీనన్‌, భజ్రంగ్‌ లోకేష్‌, అవినాష్‌, వినాయక్‌ జోషి, ప్రశాంత్‌, సుప్రీత్‌ రెడ్డి, రావు రమేష్‌, రమ్యకృష్ణ తదితరులు నటించిన

  తెరవెనక

  తెరవెనక

  ఈ చిత్రానికి సమర్పణ: హెచ్‌.డి. కుమారస్వామి, కథ: విజయేంద్ర ప్రసాద్‌, సినిమాటోగ్రఫి: మనోజ్‌ పరమహంస, మ్యూజిక్‌: యస్‌.యస్‌. థమన్‌, ఆర్ట్‌: నారాయణరెడ్డి, సాహిత్యం: రామజోగయ్యశాస్త్రి, ఫైట్స్‌: రవివర్మ, రామ్‌-లక్ష్మణ్‌, కలోయాన్‌ (బల్గేరియా), సెల్వ, కో డైరెక్టర్‌: అమ్మినేని మాధవసాయి, నిర్మాత: శ్రీమతి అనితా కుమారస్వామి, స్క్రీన్‌ప్లే - మాటలు - దర్శకత్వం: ఎ. మహదేవ్‌.

  టీజర్ ఇదే..

  జాగ్వార్ మూవీ టీజర్ ఇదే

  English summary
  Former Prime Minister Deva Gouda's grandson, Former Karnataka Chief Minister HD Kumara Swamy's son introducing his son Nikhil Kumar as hero through Jaguar movie, first look of the film launched today (31st July) morning at Park Haytt Hotel in Hyderabad
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X