జాహ్నవిపైనే కాదు.. శ్రీదేవిపై కూడా రూమర్లు.. ఇంతకీ ఏం జరుగుతున్నది?
Recommended Video

శ్రీదేవి ముద్దుల కూతురు జాహ్నవి సినిమా బాలీవుడ్‌లో ఒక్కంటంటే ఒక్కటి కూడా ఇంకా రిలీజ్ కాలేదు. కానీ జాహ్నవిపై లెక్కలేనని పుకార్లు వస్తున్నాయి. అయితే వాటిని శ్రీదేవి కుటుంబం పెద్దగా పట్టించుకొన్నట్టు కనిపించడం లేదు. తాజాగా దడ్కన్ చిత్ర హీరో ఇషాన్ కట్టర్‌తో అఫైర్ కొనసాగిస్తున్నట్టు వస్తున్న నేపథ్యంలో ఓ డిన్నర్ పార్టీకి ఇద్దరు కలిసి రావడం మీడియా కంటపడింది.

షాహీద్ డిన్నర్‌కు జాహ్నవి
దడ్కన్ చిత్రం హీరో ఇషాన్ కట్టర్ మరెవరూ కాదు. షాహీద్ కపూర్‌కు సోదరుడు. ఇటీవల షాహిద్ దంపతులు ఓ విందును ఏర్పాటు చేశారు. ఆ విందుకు సొదరుడు ఇషాన్, తల్లి నీలిమా అజీమ్‌ను షాహీద్ ఆహ్వానించారు. అయితే ఈ విందులో జాహ్నవి స్పెషల్ గెస్ట్‌గా మెరిసింది.

ఇషాన్‌తో జాహ్నవి డిన్నర్ డేట్
మరాఠిలో ఘనవిజయం సాధించిన సైరత్ చిత్ర రీమేక్‌లో ఇషాన్, జాహ్నవి నటిస్తూ బాలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. ఈ చిత్ర ప్రారంభానికి ముందే వీరిద్దరూ సినిమాలకు, డిన్నర్ డేట్స్‌కు వెళుతూ కనిపించారు.

ఇషాన్, జాహ్నవికి వార్నింగ్
అయితే ఎక్స్‌ట్రా అఫైర్లపై కాకుండా కెరీర్‌పై దృష్టిపెట్టాలని షాహిద్ హెచ్చరించినట్టు వార్తలు వచ్చాయి. అలాగే దడ్కన్ సినిమా పూర్తయ్యే వరకు జాహ్నవి అర్ధరాత్రి పార్టీలకు వెళ్లవద్దని జాహ్నవిని దర్శక, నిర్మాత కరణ్ జోహర్ హెచ్చరించినట్టు వార్తలు వచ్చాయి.

జాహ్నవికి తల్లిగా శ్రీదేవీ
ఇవన్నీ ఇలా ఉంటే, దడ్కన్ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. దడ్కన్ చిత్రంలో జాహ్నవికి తల్లిగా శ్రీదేవి నటిస్తున్నట్టు బాలీవుడ్‌లో ఓ వార్త జోరుగా షికారు చేస్తున్నది. అయితే అధికారికంగా ఎలాంటి సమాచారం రాకపోవడంతో ఆ వార్తలో ఎంత నిజముందనే విషయంపై సినీ వర్గాలు ఆరా తీస్తున్నారు.

మామ్ చిత్రానికి మంచి ప్రశంసలు
మామ్ చిత్రం తర్వాత శ్రీదేవి మరో చిత్రానికి పచ్చ జెండా ఊపిన దాఖలాలు లేవు. మామ్ తర్వాత మంచి ఆఫర్లే వచ్చినప్పటికీ.. తను ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు సమాచారం. మామ్ చిత్రంలో ఆమె నటనకు మంచి ప్రశంసలు లభించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











