»   » నాగ శౌర్యకు కౌంటర్: జై బాలయ్య నినాదాలు... జై చిరంజీవి, జై అనుష్క కూడా అంటూ కవరింగ్!

నాగ శౌర్యకు కౌంటర్: జై బాలయ్య నినాదాలు... జై చిరంజీవి, జై అనుష్క కూడా అంటూ కవరింగ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

యంగ్‌ హీరో నాగశౌర్య హీరోగా రష్మిక మండన్నా హీరోయిన్‌గా ఐరా క్రియేషన్స్‌ పతాకంపై శంకర్‌ ప్రసాద్‌ ముల్పూరి సమర్పణలో వెంకీ కుడుముల దర్శకత్వంలో ఉషా ముల్పూరి నిర్మిస్తున్న చిత్రం 'ఛలో'. ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ జనవరి 25న హైదరాబాద్‌ యూసఫ్‌గూడ పోలీస్‌ గ్రౌండ్స్‌లో జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రావడం, సినిమా ట్రైలర్, పాటలు హిట్ కావడంతో ఈచిత్రంపై మంచి హైప్ వచ్చింది. ప్రస్తుతం చిత్ర యూనిట్ అంతా సినిమా ప్రమోషన్లో బిజీగా ఉన్నారు.

డిసప్పాయింట్ అయ్యా.. ‘ఛలో’ వేదికపై చిరంజీవి..!
 విజయవాడలో ‘ఛలో' టీమ్, జై బాలయ్య నినాదాలు

విజయవాడలో ‘ఛలో' టీమ్, జై బాలయ్య నినాదాలు

సినిమా ప్రమోషన్లో భాగంగా ‘ఛలో' టీం విజయవాడ వెళ్లింది. ఈ సందర్భంగా అక్కడి సిమ్స్ కళాశాలలో చిత్ర యూనిట్ సందడి చేశారు, ఈ సందర్భంగా ‘ఛలో' టీంకు కౌంటర్ ఇస్తూ కొందరు విద్యార్థులు ‘జై బాలయ్య' అంటూ నినాదాలు చేశారు.

 జై బాలయ్య నినాదాలు అందుకే....

జై బాలయ్య నినాదాలు అందుకే....

ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ‘ఛలో' మూవీ ఆడియో వేడుకకు మెగా స్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా హీరో నాగ శౌర్య చిరంజీవిని ఉద్దేశించి భావోద్వేగమైన ప్రసంగం చేశారు.... అందుకు కౌంటర్‌గా అక్కడి బాలయ్య ఫ్యాన్ స్టూడెంట్స్ ఈ నినాదాలు చేసినట్లు సమాచారం.

 ఆ మాటలు బాగా ప్రభావం చూపాయా?

ఆ మాటలు బాగా ప్రభావం చూపాయా?

ఇటీవల ఆడియో వేడుకలో నాగ శౌర్య మాట్లాడుతూ.....చిరంజీవిగారు యాక్ట్ చేసిన రోజుల్లో నెం.1, నెం. 2, నెం.3, నెం.4 ఇలా నాలుగు కుర్చీలు ఉండేవి. ఆయన వెళ్లిపోయిన తర్వాత కుర్చీలు లేవు, అందరూ నిల్చోవడమే, మళ్లీ మెగాస్టార్ వచ్చారు, కుర్చీ తెచ్చుకున్నారు, ఆయనే వేసుకుని కూర్చున్నారు.... ఇక ఎవరూ రారు, రాలేరూ, కూర్చోలేరు. ఆ కుర్చీ ఆయనది కాదు, ఆయన కోసమే కుర్చీ పుట్టింది అంటూ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. వేరే జన్మ ఉంటే మా అమ్మా నాన్న కొడుకుగా పుడతాను, మెగాస్టార్ అభిమానిగా పుడతాను' అంటూ నాగ శౌర్య వ్యాఖ్యానించారు. ఈ స్పీచ్ ప్రభావం కళాశాల విద్యార్థులపై బాగా ప్రభావం చూపినట్లు ఉంది.

 వారిని ఉత్సాహ పరచడానికి జై బాలయ్య నినాదాలు

వారిని ఉత్సాహ పరచడానికి జై బాలయ్య నినాదాలు

విజయవాడ పర్యటనలో కొందరు విద్యార్థులు జై బాలయ్య నినాదాలు చేయడంతో...... వారిని ఉత్సాహ పరచడానికి ఈ కార్యక్రమంలో శౌర్య వెంట ఉన్న ఆయన సోదరుడు జై బాలయ్య అంటూ బిగ్గరగా నినాదాలు చేసి వారిని ఉత్సాహ పరిచాడు.

 కవర్ చేసిన నాగ శౌర్య

కవర్ చేసిన నాగ శౌర్య

నాగ శౌర్య మాట్లాడుతుండగా కూడా కొందరు విద్యార్థులు జై బాలయ్య అంటూ అరిచారు. దీంతో నాగ శౌర్య రియాక్ట్ అవుతూ... ‘జై బాలయ్య, జై ఎన్టీఆర్, జై చిరంజీవి, జై పవన్ కళ్యాణ్.... జై అనుష్క కూడా' అంటూ కవర్ చేశారు.

మేమంతా ఒకటే

మేమంతా ఒకటే

మేమంతా ఒకటే అండీ, మా మధ్య ఎలాంటి విబేధాలు లేవు అంటూ...... అరుపులు అరుస్తున్న విద్యార్థులను సముదాయించే ప్రయత్నం చేశారు నాగ శౌర్య. అనంతరం ‘ఛలో' టీం విజయవాడలోని ఇతర కళాశాలను సందర్శించారు.

English summary
Naga Shaurya's covering for his brother's Jai Balayya slogans during Chalo team tour in Vijayawada. Also starring Rashmika Mandanna, #Chalo movie will be released on 2nd February.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu