twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘జై లవ కుశ’ ఆడియో రిలీజ్: ఎన్టీఆర్ ఎమోషనల్... హరికృష్ణ-బాలయ్య ప్రస్తావన!

    జై లవ కుశ ఆడియో రిలీజ్ అయింది. పాటలు నేరుగా మార్కెట్లోకి రిలీజ్ చేశారు.

    By Bojja Kumar
    |

    వరుస విజయాలతో దూసుకుపోతోన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, ఆయన సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మాణం లో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకం పై భారీ స్థాయి లో రూపొందుతోన్న చిత్రం 'జై లవ కుశ' . ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తోన్న ఈ చిత్రానికి ఇప్పటికే మార్కెట్ లో విశేషమైన ఆకర్షణ ఉన్న సంగతి తెలిసినదే.

    ఈ చిత్రం ఆడియోను లహరి మ్యూజిక్ ద్వారా ఆదివారం నేరుగా మార్కెట్లోకి రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఆడియో రిలీజ్ ప్రెన్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నందూమరి హరికృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, రాశి ఖన్నా, బాబీ, కోన వెంకట్, చోటాకె నాయుడు, బ్రహ్మాజీ, రామ జోగయ్య శాస్త్రి, చంద్రబోస్ తదితరులు హాజరయ్యారు.

    ఎన్టీఆర్ ఎమెషనల్ స్పీచ్

    ఎన్టీఆర్ ఎమెషనల్ స్పీచ్

    ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ..... ‘జనతా గ్యారేజ్' తర్వాత ఎలాంటి చిత్రం చేయాలి అనే సందిగ్ధంలో ఉన్నపుడు మనసుకు నచ్చిందే చేయాలా? ట్రెండు ఫాలో అవుతూ పోవాలా? అర్థం కాలేదు. బాబీ వచ్చి కథ చెప్పగానే మనసుకు నచ్చిన కథే చేయాలని నిర్ణయించుకున్నాను. ఎందుకింత ఆలోచించడం జరిగిందంటే... ఈ చిత్రం కేవలం ఒక చిత్రంగా కాదు, నేను, మా కళ్యాణ్ అన్నయ్య కలిసి చేస్తున్న సినిమా. నేను, అన్న‌య్య కళ్యాణ్ తో పాటు మా పెద్ద‌న్న‌య్య కీర్తిశేషులు జాన‌కిరాంగారు ఉండుంటే జై ల‌వ‌కుశ అనే టైటిల్‌కు స‌రిపోయేది అంటూ తారక్ ఎమోషనల్‌గా మాట్లాడారు.

    నాన్నకు గిఫ్టుగా

    నాన్నకు గిఫ్టుగా

    ఈ సినిమాను మా నాన్న‌గారికి కానుక‌గా ఇవ్వాల‌ని ఎంతో ప్ర‌య‌త్నించాం. కానీ కుద‌ర‌లేదు. సెప్టెంబ‌ర్ 2 అయితే ఏంటి, సెప్టెంబ‌ర్ 21 అయితే ఏంటి మా నాన్న‌కు కానుక‌గా ఇవ్వాల‌ని చేసిన సినిమా ఇది. అన్న‌ద‌మ్మ‌లు క‌లిసి చేసిన ఈ సినిమాతో మా అమ్మ‌ల‌కు మేం సాధించిన విజ‌య‌మిది అని ఈ చిత్రంతో చెప్పాల‌ని ఉంది. త‌ప్ప‌కుండా అమ్మ‌, నాన్న‌లను గ‌ర్వంగా ఫీల‌య్యేలా చేసే సినిమా ఇది అని నాకు గట్టి న‌మ్మ‌కంగా ఉంది... అని ఎన్టీఆర్ అన్నారు.

    ముందు తరాలకు

    ముందు తరాలకు

    మా త‌రువాత జ‌న‌రేష‌న్‌కు, మా పిల్లలకు ఇలా మేం ఇద్ద‌రం క‌లిసి ఓ సినిమా చేశాం అని చెప్పుకోవడానికి చాలా బావుండే సినిమా. ఈ సినిమా అలా మిగిలిపోతుంది. అన్న‌ద‌మ్ముల ఔన‌త్యాన్ని పెంపొందించే చిత్రం దొర‌క‌డం అదృష్టంగా ఉంది. నా కెరీర్‌లో సంతృప్తిక‌ర‌మైన చిత్రం ఇది... అని ఎన్టీఆర్ అన్నారు.

    దేవిశ్రీ ప్రసాద్ గురించి

    దేవిశ్రీ ప్రసాద్ గురించి

    దేవిశ్రీకి, నాకు మధ్య ఉన్న అనుబంధం కేవలం హీరో, మ్యూజిక్ డైరెక్టర్ కాదు. ఆయన నాకు బ్ర‌ద‌ర్‌, స్నేహితుడు, నా మంచిని కోరుకునే వ్య‌క్తి. నాకు త‌న‌పై ఉన్న న‌మ్మ‌కం, త‌నకు నాపై ఉన్న ప్రేమ‌కు ఇది తార్కాణం. మా మ‌ధ్య అనుబంధానికి మాట‌లు అవ‌స‌రం లేదు. పాటలే నిద‌ర్శ‌నం. పాట‌లు వింటే మూడు క్యారెక్ట‌ర్స్ ఓ మెసేజ్‌ను ఇస్తుంటాయి. రామ‌జోగ‌య్య‌శాస్త్రి, చంద్ర‌బోస్‌గారు అద్భుత‌మైన పాట‌ల‌ను రాశారు.. అని ఎన్టీఆర్ వ్యాఖ్యానించారు.

    అపుడు నేను-బాలయ్య... ఇపుడు కళ్యాణ్-తారక్

    అపుడు నేను-బాలయ్య... ఇపుడు కళ్యాణ్-తారక్

    ``జై ల‌వ‌కుశ పేరు చూడ‌గానే ఆనాడు మా తండ్రిగారు, స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క రామారావుగారు న‌టించిన ఆనాటి ల‌వ‌కుశ సినిమా గుర్తుకొస్తుంది. చ‌రిత్ర సృష్టించిన సినిమా అది. రాముడంటే ఇలా ఉంటాడ‌ని ప్ర‌జ‌ల‌కు ఎలుగెత్తి చెప్పిన సినిమా. అలాగే ఈ సినిమా కూడా ప్ర‌జ‌ల మ‌న్న‌లు పొందాల‌ని కోరుకుంటున్నాను. మా నాన్నగారు ఇచ్చిన గొప్ప ఆస్థి అభిమానం. అభిమానుల కార‌ణంగానే నంద‌మూరి వంశం ఇలా ముందుకు వెళుతుంది. ఇంకా ముందుకు వెళ్లాలి. జై ల‌వ‌కుశ కుటుంబ క‌థా చిత్రం. ఇక్క‌డ చిత్రం ఏంటంటే త‌మ్ముడు హీరో అయితే, అన్న నిర్మాత‌. ఇది చూస్తుంటే అల‌నాడు మా రామ‌కృష్ణా స్టూడియోస్ గుర్తుకొస్తుంది. నేను ప్రొడ్యూస‌ర్ అయితే మా బాల‌య్య ఆర్టిస్ట్‌. అలాగే ఇప్పుడు ఈ సినిమా కూడా ఎన్టీఆర్ యాక్ట్ చేస్తే, కళ్యాణ్ బాబు నిర్మించారు... అని హరికృష్ణ వ్యాఖ్యానించారు.

    దేవిశ్రీ ప్రసాద్

    దేవిశ్రీ ప్రసాద్

    ``జై, ల‌వ‌, కుశ అనే క్యారెక్టర్స్ ఎలాగో తార‌క్‌తో ఇది నాకు వ‌రుస‌గా మూడో సినిమా. తార‌క్ నాకు బ్ర‌ద‌ర్ లాంటివాడు. ఓ హీరోకు నా కెరీర్‌లో వ‌రుస‌గా మూడు సినిమాల‌కు మ్యూజిక్ అందించ‌డం ఇదే ప్ర‌థ‌మం. సినిమా అద్భుతంగా వ‌చ్చింది. బాబి వండ‌ర్‌ఫుల్ స్క్రిప్ట్ ఇచ్చాడు. స్క్రిప్ట్ చెప్పిన రోజున ఏ ఎగ్జ‌యిట్‌మెంట్ ఉందో, దాన్ని హండ్రెడ్ ప‌ర్సెంట్ పెంచేలా సినిమా తీశారు. ఇప్పుడు జ్యూక్ బాక్స్‌లో విన్న సాంగ్స్ కాకుండా మ‌రో సాంగ్‌ను త్వ‌ర‌లోనే రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం. మంచి డ్యాన్సింగ్ సాంగ్‌. ఎల‌క్ట్రానిక్ ఫోక్‌లో డిఫ‌రెంట్‌గా సాగే పాట‌`` అని దేవిశ్రీ ప్రసాద్ అన్నారు.

    కళ్యాణ్ రామ్

    కళ్యాణ్ రామ్

    కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ...``మా నంద‌మూరి కుటుంబంలో ఓ ప్రొడ‌క్ష‌న్ హౌస్‌. అందులో ఓ నంద‌మూరి హీరో యాక్ట్ చేసి చాలా సంత్స‌రాలైంది. నాకు చాలా ఆనందంగా ఉంది. దేవిశ్రీ ప్ర‌సాద్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. సిచ్చువేష‌న‌ల్ సాంగ్స్‌. అన్ని స‌న్నివేశాల‌కు త‌గిన‌ట్లు డిఫ‌రెంట్‌గా ఉంది. తార‌క్ గురించి సెప్టెంబ‌ర్ 10న మాట్లాడుతాను. స‌న్ని, మా హ‌రికి థాంక్స్‌. బాబికి చాలా క‌ష్ట‌ప‌డ్డాడు. యూనిట్ స‌భ్యులంద‌రూ చాలా క‌ష్ట‌ప‌డ్డారు. సినిమాను సెప్టెంబ‌ర్ 21న విడుద‌ల చేస్తున్నాం`` అన్నారు.

    దర్శకుడు బాబీ

    దర్శకుడు బాబీ

    దర్శకుడు బాబీ మాట్లాడుతూ ``ఎన్టీఆర్ ఆర్ట్స్ బేన‌ర్‌లో తార‌క్ గారి సినిమాను నేను డైరెక్ట్ చేయ‌డం ఎంతో ఆనందంగా అనిపించింది. తార‌క్ గారి గురించి చాలా దాచుకున్నాను. ఎన్టీఆర్‌గారితో మూడు వేరియేష‌న్స్ ఉన్న సినిమాను డైరెక్ట్ చేసే అవ‌కాశం నాకు వ‌చ్చింద‌ని గ‌ర్వంగా చెప్పుకుంటున్నాను. ఎన్టీఆర్‌గారి పెర్‌ఫార్మెన్స్‌కు నేను సాక్షిని. ప్ర‌తిరోజూ నేను ఎంజాయ్ చేశాను. మూడు లేయ‌ర్స్‌ను హ్యాండిల్ చేయ‌డం చాలా క‌ష్టం. మంచి టీం దొరికింది. గ్యాప్ లేకుండా సినిమాను పూర్తి చేశాం. దేవిశ్రీ, క‌థ వింటున్న‌ప్పుడే అసుర అసుర‌..రావ‌ణాసుర అనే ట్యూన్ ఇచ్చారు. అద్భుత‌మైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇస్తున్నారు. రాశి, నివేదిత‌, రామ‌జోగ‌య్య‌శాస్త్రి, చంద్ర‌బోస్ స‌హా అంద‌రికీ థాంక్స్‌`` అన్నారు.

    కుశ క్యారెక్టర్

    కుశ క్యారెక్టర్

    సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు మాట్లాడుతూ.... సినిమాలో కుశ క్యారెక్ట‌ర్ నాన్‌స్టాప్‌గా న‌వ్విస్తుంటాడు. నేను జై, కుశ క్యారెక్ట‌ర్స్‌తో ల‌వ్‌లో ప‌డిపోయాను. బాబి, ఎన్టీఆర్‌, స‌హా యూనిట్ అంతా మంచి అవుట్‌పుట్‌ను రాబ‌ట్టాం. ఎన్టీఆర్ చేసిన న‌త్తి క్యారెక్ట‌ర్‌ను ప్రేక్ష‌కులు యాక్సెప్ట్ చేస్తారా అనిపించింది. కానీ ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్ వ‌చ్చింది. ఎన్టీఆర్ చేసిన మూడు క్యారెక్ట‌ర్స్ చూసి స్పెల్ బౌండ్ అయ్యాను. ఈ సినిమా గ్రేట్ ఎక్స్‌పీరియెన్స్‌`` అన్నారు.

    జై లవ కుశ

    జై లవ కుశ

    రాశీ ఖన్నా , నివేత థామస్ ఈ చిత్రం లో కథానాయికలు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించే ఈ చిత్రానికి చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్ ఏ ఎస్ ప్రకాష్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వర రావు, తమ్మి రాజు. విసువల్ ఎఫెక్ట్స్ : అనిల్ పాదూరి (అద్విత క్రియేటివ్ స్టూడియోస్).

    English summary
    Jai Lava Kusa Movie Audio Launch Press Meet held at Hyderabad. Jr NTR, Raashi Khanna, KS Ravindra, Nandamuri Kalyan Ram, Chandrabose, Ramajogayya Sastry, Chota K Naidu, Raghu Karumanchi, Brahmaji, Suma, Kona Venkat at the event.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X