»   » ఎన్టీఆర్ గెటప్ ఫైనల్ కాదట.. ఇంకా క్రూరంగా.. భయంకరంగా ..

ఎన్టీఆర్ గెటప్ ఫైనల్ కాదట.. ఇంకా క్రూరంగా.. భయంకరంగా ..

Posted By:
Subscribe to Filmibeat Telugu

వరుస హిట్లతో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్ తాజాగా జై లవకుశ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రం ఇదే. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను జూనియర్ ఎన్టీఆర్ జన్మదినమైన మే 20న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వార్త అధికారికంగా త్వరలోనే విడుదల కానున్నట్టు సమాచారం.

ట్రిపుల్ రోల్..

ట్రిపుల్ రోల్..

జై లవకుశ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నారనేది టాక్. ఈ చిత్రంలో ఓ పాత్రలో విలన్‌గా కనిపించనున్నాడట. ఆ చిత్రానికి చెందిన భయంకరమైన స్టిల్స్ ఇటీవల ఇంటర్నెట్‌లో హల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో జూనియర్ లుక్ చాలా క్రూరంగా ఉన్నట్టు ఫొటోలలో స్పష్టమైంది.

ఫైనల్ కాదు..

ఫైనల్ కాదు..

అతి క్రూరమైన వేషధారణలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ లుక్ ఫైనల్ కాదు. ఇంకా ఆ లుక్ పూర్తి స్థాయిలో ఆ గెటప్ మరింత విభిన్నంగా ఉంటుంది. ఇది కేవలం ట్రయల్ పిక్చర మాత్రమే. అసలు రూపం వేరేగా ఉంటుంది అని హాలీవుడ్ మేకప్ మెన్ వాన్స్ హర్ట్‌వెల్ ట్వీట్ చేయడంతో ఈ గెటప్‌పై మరింత ఆసక్తి పెరిగింది.

డిఫరెంట్‌గా..

డిఫరెంట్‌గా..

జై లవకుశలో ఎన్టీఆర్ పోషించే పాత్రలు దేనికి అవే హైలెట్‌గా ఉంటాయట. ప్రతీ పాత్రను చాలా డిఫరెంట్‌గా తీర్చిదిద్దినట్టు సమాచారం. మూడు పాత్రల్లో విలన్ ఛాయలు ఉన్న పాత్ర ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలుగజేస్తుంది. ఎన్టీఆర్ నట విశ్వరూపానికి అది తార్కాణంగా ఉంటుంది అనే మాట వినిపిస్తున్నది.

హాలీవుడ్ స్థాయికి..

హాలీవుడ్ స్థాయికి..

హాలీవుడ్ స్థాయి నిర్మాణ విలువలతో తెరకెక్కుతున్న జై లవకుశ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన రాశీఖాన్నా, నివేదా థామస్ నటిస్తున్నారు. ఎన్టీఆర్ సోదరుడు కల్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరిస్తూ తీస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు బాబీ. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు.

English summary
The first look poster of NTR’s Jai Lava Kusa, in which he plays triple role, will be release on May 20 to coincide with the actor’s birthday. The look of the antagonist’s role has already gone viral. NTR will wear prosthetic make up for this character and he will speak with a stutter. It’s going to be a very interesting character with a menacing side and audiences are in for a surprise.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu