»   » ఎన్టీఆర్ చేతికి సంకెళ్లు..... ‘జై లవ కుశ’ ఫస్ట్ లుక్ సూపర్బ్

ఎన్టీఆర్ చేతికి సంకెళ్లు..... ‘జై లవ కుశ’ ఫస్ట్ లుక్ సూపర్బ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ హిట్‌తో మంచి జోష్ మీదున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో మరో సినిమాకు కమిటైన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 'జై లవ కుశ' అనే టైటిల్ ఖరారు చేసారు.

శ్రీరామ నవమి సందర్భంగా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసారు. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. ఎన్టీఆర్ ఇందులో పవర్ ఫుల్ లుక్స్ తో గత సినిమాలకు భిన్నంగా ఆకర్షనీయంగా ఉండటం గమనార్హం.ఎన్టీఆర్ ఆర్ట్స్

ఎన్టీఆర్ ఆర్ట్స్

నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బేనర్లో కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కెఎస్ రవీంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.


చేతికి సంకెళ్లు

చేతికి సంకెళ్లు

ఎన్టీఆర్ చేతికి సంకెళ్లు వేసుకుని కనిపిస్తుండటంతో సినిమాలో ఎలాంటి పాత్రలో ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు? అనేది విషయమై ఆసక్తి నెలకొంది.


త్రిపాత్రాభినయం

ఈ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నారు. మూడు విభిన్నమైన పాత్రల్లో ఎన్టీఆర్ కనిపించబోతున్నారు. ఈ మూడు పాత్రల్లో ఒకటి నెగెటివ్ రోల్ ఉంటుందని టాక్.


హీరోయిన్లు

హీరోయిన్లు

ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన రాశి ఖన్నా, నివేదా థామస్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. కన్నడ హీరో దునియా విజయ్ విలన్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.
English summary
Jai Lava Kusa is an upcoming Telugu language film written and directed by K. S. Ravindra. The movie features Jr. NTR, Raashi Khanna and Niveda Thomas in the lead roles.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu