»   » ‘జై లవ కుశ’ ఆడియో సాంగ్స్ వచ్చేసాయ్... 4 పాటలు అదిరాయ్!

‘జై లవ కుశ’ ఆడియో సాంగ్స్ వచ్చేసాయ్... 4 పాటలు అదిరాయ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

వరుస విజయాలతో దూసుకుపోతోన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరో గా , సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మాణం లో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకం పై భారీ స్థాయి లో రూపొందుతోన్న చిత్రం 'జై లవ కుశ' . యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తోన్న ఈ చిత్రానికి ఇప్పటికే మార్కెట్ లో విశేషమైన ఆకర్షణ ఉన్న సంగతి తెలిసినదే.

ఈ చిత్రం ఆడియో నేడు(సెప్టెంబర్ 3) డైరెక్ట్ గా మార్కెట్ లో కి విడుదల చేశారు. మొత్తం 4 పాటలు ఉన్నాయి. దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన సంగీతానకి మంచి స్పందన వస్తోంది. ఆడియో సూపర్ హిట్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.


సాంగ్స్ ఇవే...

అసుర అసుర రావణాసుర, ట్రింగ్ ట్రింగ్, నీ కళ్లలోనే..., దోచేస్తా అనే మొత్తం నాలుగు పాటలున్నాయి.వినాయక నిమజ్జనం ఎఫెక్ట్

వినాయక నిమజ్జనం ఎఫెక్ట్

తొలుత భారీ స్థాయి లో ఆడియో ఫంక్షన్ ను ప్లాన్ చేసినప్పటికీ, భారీ వర్ష సూచన తో పాటు, వినాయక నిమ్మజ్జనం లో పోలీస్ శాఖ నిమగ్నమై ఉండటం తో, అభిమానుల భద్రత కి ప్రాధాన్యం ఇస్తూ, డైరెక్ట్ గా మార్కెట్ లో కి విడుదల చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు చిత్ర బృందం తెలిపింది.


ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్‌గా

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్‌గా

సెప్టెంబర్ 10 న, హైదరాబాద్ లో అభిమానుల మధ్య, "జై లవ కుశ" ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను చేయటానికి ఏర్పాట్లు చేస్తున్నారు.


అభిమానుల భద్రతే ముఖ్యం

అభిమానుల భద్రతే ముఖ్యం

నిర్మాత కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ, " సోదరుడు ఎన్టీఆర్ తో , ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకం పై "జై లవ కుశ" చిత్రాన్ని నిర్మించటం ఎంతో ఆనందం గా ఉంది. ఈ చిత్రాన్ని భారీ స్థాయి లో, అత్యుత్తమ సాంకేతిక విలువలతోనిర్మించాం. అభిమానుల భద్రత కి ప్రాధాన్యం ఇస్తూ , ఆడియో ని డైరెక్ట్ గా మార్కెట్ లో కి విడుదల చేస్తున్నాం. కానీ ట్రైలర్ ను మాత్రం అభిమానుల నడుమ సెప్టెంబర్ 10 న హైదరాబాద్ లో విడుదల చేస్తాం " అని అన్నారు.


జై లవ కుశ

జై లవ కుశ

కే. ఎస్. రవీంద్ర (బాబీ) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రాశీ ఖన్నా , నివేత థామస్ ఈ చిత్రం లో కథానాయికలు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించే ఈ చిత్రానికి చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్ ఏ ఎస్ ప్రకాష్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వర రావు, తమ్మి రాజు. విసువల్ ఎఫెక్ట్స్ : అనిల్ పాదూరి (అద్విత క్రియేటివ్ స్టూడియోస్).


English summary
Listen to the Jai Lava Kusa Full Songs Jukebox starring Jr NTR, Raashi Khanna, Nivetha Thomos. Cast : Jr NTR, Rashi Khanna , Nivetha Thomas, Ronit Roy,Posani Krishna Murali, Brahmaji, Pradeep Rawat, Jayprakash Reddy, Prabhas Sreenu , Praveen, Hamsa Nandini. Music : Devi Sri Prasad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu