»   » ఎన్టీఆర్ న్యూ మూవీ ‘జై లవ కుశ’ ఫస్ట్ లుక్ రిలీజ్

ఎన్టీఆర్ న్యూ మూవీ ‘జై లవ కుశ’ ఫస్ట్ లుక్ రిలీజ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ హిట్‌తో మంచి జోష్ మీదున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో మరో సినిమాకు కమిటైన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 'జై లవ కుశ' అనే టైటిల్ ఖరారు చేసారు. శ్రీరామ నవమి సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసారు.

నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బేనర్లో కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కెఎస్ రవీంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

rn

మోషన్ పోస్టర్ సూపర్

తాజాగా విడుదలైన ఈ మోషన్ పోస్టర్ కు అభిమానుల నుండి మంచి స్పందన వస్తోంది. కొన్ని నిమిషాల్లో వేల కొద్ది హిట్స్ వచ్చాయి.

ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం

ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం

ఈ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నారు. మూడు విభిన్నమైన పాత్రల్లో ఎన్టీఆర్ కనిపించబోతున్నారు. ఈ మూడు పాత్రల్లో ఒకటి నెగెటివ్ రోల్ ఉంటుందని టాక్.

హీరోయిన్లు ఎవరు?

హీరోయిన్లు ఎవరు?

ఇప్పటివరకూ రాశిఖన్నాను మాత్రమే హీరోయిన్ గా ప్రకటించారు. మరో హీరోయిన్ పాత్రకు నివేదా థామస్ ను తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మూడు పాత్రల్లో ఓ పాత్రకు హీరోయిన్ ఉండదని తెలుస్తోంది.

సమంత?

సమంత?

ఈ సినిమాలో హీరోయిన్ సమంత గెస్ట్ పాత్రలో నటించబోతున్నట్లు టాక్. సమంత ఇప్పటికే ఎన్టీఆర్ కలిసి నాలుగు సినిమాలు చేసిన సంగతి తెలిసిందే.

English summary
Jai Lava Kusa Logo Motion Poster released. Jr NTR, Rashi Khanna , Posani Krishna Murali, Brahmaji, Pradeep Rawat, Jayprakash Reddy, Prabhas Sreenu , Praveen, Hamsa Nandini
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu