»   » కొట్టేయడంతో పాటు కొట్టడమూ వచ్చురా..!: అదరగొట్టాడు, కుశ టీజర్ ఇదే

కొట్టేయడంతో పాటు కొట్టడమూ వచ్చురా..!: అదరగొట్టాడు, కుశ టీజర్ ఇదే

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'జై లవకుశ'.ఇటీవల ఈ చిత్రంలోని మూడో పాత్రైన 'కుశ'ను పరిచయం చేసిన చిత్రబృందం ఇప్పుడు టీజర్‌ను విడుదల చేసింది.ఎప్పుడెప్పుడా అని నందమూరి అభిమానులు ఎదురుచూస్తున్న కుశ టీజర్ వచ్చేసింది..చెప్పిన టైంకే చిత్ర యూనిట్ శుక్రవారం ఉదయం 10 గంటలకు టీజర్ ను యూట్యూబ్ లో రిలీజ్ చేసారు. టీజర్ లో కుశ గెటప్ లో ఎన్టీఆర్ బాగున్నాడు. టీజర్ స్టార్టింగ్ లో అదిరిపోయే స్టెప్స్ తో అలరించాడు..

టీజర్‌లో తారక్‌.. 'కొట్టేయడంతో పాటు కొట్టడమూ వచ్చురా' అని చెప్తున్న డైలాగ్‌ ఆకట్టుకుంటోంది. 'ఈ డబ్బు తీసుకెళ్లి అమెరికాలోఇన్వెస్ట్‌ చేసి ఆ ఆధార్‌ కార్డేదో నాకు ఇప్పిచ్చేయండి బాబూ' అని తారక్‌ అంటుంటే.. 'దాన్ని ఆధార్‌ కార్డు అనరమ్మా గ్రీన్‌ కార్డు అంటారు' అని చెప్పడం ఫన్నీగా ఉంది.అలాగే టీజర్‌కు దేవీ శ్రీ ప్రసాద్‌ అందించిన బ్యాక్‌గ్రౌండ్‌ కూడా బాగుంది. ఇక ఈ మూవీలో ఎన్టీఆర్‌ సరసన నివేథా థామస్‌, రాశిఖన్నా, నందిత నటిస్తుండగా, మాస్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీపై ఇటు అభిమానుల్లో పాటు అటు టాలీవుడ్‌ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలే ఉన్నాయి. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న ఈ మూవీకి దేవీ శ్రీ సంగీతాన్ని అందిస్తుండగా, బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. దసరా కానుకగా సెప్టెంబర్‌ 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


English summary
The teaser of third character from Jai Lava Kusa is out. It is Kusa this time and we have to say, it is entertaining.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu