»   » గమనించారా? ఈ ఫొటోలో ‘బాహుబలి’లో మెయిన్ ట్విస్ట్ రివీలైంది

గమనించారా? ఈ ఫొటోలో ‘బాహుబలి’లో మెయిన్ ట్విస్ట్ రివీలైంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాహుబలి 2 చిత్రం క్లైమాక్స్‌ షూటింగ్ నిన్న తెల్లవారుజామున మొదలెట్టారు. నిన్నంతా భారీ యుద్ధ సన్నివేశం షూటింగ్‌లో మంచి బిజీగా ఉన్న రాజమౌళి, నెలల కొద్దీ కష్టపడి ప్లాన్ చేసిన ఈ షూటింగ్ మొదటిరోజు సక్సెస్ ఫుల్ గా ముగిసేసరికి ఆనందం పట్టలేకపోయారు.

అందుకే యుద్ధ సన్నివేశంలో ప్రభాస్ చెయ్యి ముందుకు అభివాదం చేస్తున్నట్లు ఉన్న ఫొటోను ట్వీట్ చేశారు. ఈ ఫొటోలో ప్రభాస్ చేతికి రక్తం మరకలు ఉండటం గమనించవచ్చు. అంటే యుద్దంలో వీరోచితంగా పోరాడినట్లున్నాడు బాహుబలి. ఈ క్రింద ఇచ్చిన ఫొటో లేదా వీడియో చూస్తే మీకు బాహుబలి గురించి మెయిన్ క్లూ రివీల్ అవుతుంది మీరు గమనిస్తే...

ఆ ట్విస్ట్ మరేదో కాదు .. బాహుబలి పార్ట్ 1 సినిమా చివరలో మనకు ప్రశ్నగా సస్పెన్స్ గా వదిలేసిన ..కట్టప్ప ఎందుకు బాహుబలిని చంపాడు అన్న ప్రశ్నకు సంభందించిన క్లూ అన్నమాట.

ఈ ఫొటోలో లేదా వీడియోలో మీకు ... మహిష్మతి బ్రాస్ లెట్ ధరించిన ప్రబాస్ కనిపిస్తాడు. అంటే అమరేంద్రబాహుబలి కు చెందిన చెయ్యి అన్నమాట అది. శివుడు క్యారక్టర్ కు ఆ బ్రాస్ లెట్ లేదు. అంటే అమరేంద్ర బాహుబలి బ్రతికున్నట్లే. అలాగే సెకండాఫ్ లో అమరేంద్ర బాహుబలి...అనుష్క తో ప్రేమ కథ కూడా ఉండబోతోందన్నమాట.

గత రెండు నెలలుగా ఈ సన్నివేశాల కోసం ప్రభాస్ కఠోర శిక్షణ తీసుకుంటున్నట్లు తెలిపారు.ఇక ఈ యుద్ధ సన్నివేశం షూటింగ్ కోసం హాలీవుడ్ నుంచి నిపుణుల బృందం పెద్ద ఎత్తున దిగింది. గతంలో లింగా, బాహుబలి సినిమాలకు యాక్షన్ డైరెక్షన్ చేసిన లీ వీట్టేకర్ ఇప్పుడు ఈ సినిమా కోసం వచ్చాడు. అతడితో పాటు బ్రాడ్ అలన్, అతడి బృందం మొత్తం దిగింది.

ఇంతకుముందు సల్మాన్ ఖాన్ నటించిన సుల్తాన్ సినిమాతో పాటు 'ద హంగర్ గేమ్స్' సిరీస్‌కు పనిచేసిన లార్నెల్ స్టోవాల్, 'ద హాబిట్' సినిమాకు పనిచేసిన మోర్న్ వాన్ టాండర్ లాంటివాళ్లు ఈ క్లైమాక్స్ సన్నివేశాలకు కీలకంగా మారనున్నారు. వీళ్లందరినీ సమన్వయం చేసుకుంటూ రాజమౌళి క్లైమాక్స్ యుద్ధ సన్నివేశాన్ని చిత్రీకరించనున్నారు. అంతా అనుకున్నట్లే జరిగితే ఈ సినిమా 2017 ఏప్రిల్ 18న విడుదల కావాలి.

English summary
Baahubali 2 has finished its first day of the climax shoot.He tweeted, “Fantastic first day at war... Months of planning helped everything roll out smoothly.. Jai Mahishmathi..!!”
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu