»   » హీరోయిన్ అంజలి బర్త్ డే: ఆమె లవర్ ఏం చేశాడో తెలుసా?

హీరోయిన్ అంజలి బర్త్ డే: ఆమె లవర్ ఏం చేశాడో తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ అంజలి, తమిళ హీరో జై ప్రేమించుకుంటున్నారనే విషయం తెలిసిందే. షాపింగ్ మాల్ సినిమా సమయంలో ఏర్పడిన వీరి పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది. చాలా రోజుల వరకు రహస్యంగా, చాటు మాటుగా యవ్వారం సాగించిన ఈ ఇద్దరు కొన్ని రోజుల క్రితమే ఓపెన్ అయ్యారు. జై స్వయంగా అంజలితో ప్రేమలో ఉన్న విషయాన్ని అంగీకరించారు.

ఇద్దరి మధ్య చాలా కాలం నుండి మంచి స్నేహం ఉందని, అంజలి అంటే తనకు చాలా ఇష్టమని, అంజలికి కూడా తానంటే ఇష్టమని జై చెప్పుకొచ్చారు. ఎంగేయుమ్ ఎప్పోదుమ్(తెలుగులో 'జర్నీ') సమయంలోనే తమ స్నేహం మొదలైందని జై తెలిపారు.

కాగా.. ఈ రోజు(జూన్ 16) అంజలి పుట్టినరోజును పురస్కరించుకుని జై ట్విట్టర్లో ఓ పోస్ట్ చేశారు.

విషెష్ చెబుతూ ట్వీట్

విషెష్ చెబుతూ ట్వీట్

తన ప్రేయసికి విషెస్ చెబుతూ హీరో జై పోస్టు చేసిన సందేశం ఆకట్టుకుంటోంది. అంజలిని ముద్దుగా అంజు అని సంభోదిస్తూ.... నువ్వు నాకు ఎంతో స్పెషల్. ఎలాంటి పరిస్థితుల్లో అయినా నేను నీ వెంటే ఉంటా, హ్యాపీ బర్త్ డే అంజు అంటూ ట్వీట్ చేశాడు.

మురిసి పోయిన అంజలి

మురిసి పోయిన అంజలి

తన ఇష్ట సఖుడు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపడంతో అంజలి సంతోషంతో పొంగిపోయింది. నేను సైతం ఎప్పుడూ నీ వెంటే ఉంటా నంటూ తన ప్రేమను వ్యక్త పరిచింది.

జై ఫ్యామిలీతో అంజలి అనుబంధం

జై ఫ్యామిలీతో అంజలి అనుబంధం

జైతో మాత్రమే కాదు... జై ఫ్యామిలీకి కూడా అంజలి చాలా క్లోజ్. అంజలి చేసే వంట అంటే జై తండ్రికి చాలా ఇష్టమట. జై ముగ్గురు సిస్టర్స్ తో కూడా ఆమె చాలా క్లోజ్ గా ఉంటుంది. ఈ విషయాన్ని జై ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారు.

ఇప్పట్లో లేదు

ఇప్పట్లో లేదు

పెళ్లి గురించి ఇంకా ఆలోచించలేదని... ఇండస్ట్రీలో తమకంటే సీనియర్లు చాలా మంది ఉన్నారని, వారి పెళ్లిళ్లయ్యాక తమ పెళ్లి గురించి ఆలోచిస్తామని జై తెలిపారు. అంజలి, జై ఇద్దరూ పెళ్లి కంటే ప్రొఫెషనల్ గా ఎదిగేందుకే ఆసక్తి చూపుతున్నట్లు స్పష్టమవుతోంది.

దోశ సాక్షిగా...: అతడితో హీరోయిన్ అంజలి లవ్

దోశ సాక్షిగా...: అతడితో హీరోయిన్ అంజలి లవ్

అంజలి, జై ప్రేమాయణం దోశ చాలెంజ్ వల్ల అందరికీ తెలిసిపోయింది. ఈ దోశ చాలెంజ్ ఏమిటి, దానికి వెనక ఉన్న కథేమిటి?

ఫోటోలు, వివరాల కోసం క్లిక్ చేయండి.

లవ్ ప్రపోజల్స్

లవ్ ప్రపోజల్స్

లవ్ ప్రపోజల్స్, అతడితో రిలేషన్, కారు గిఫ్టు‌పై హీరోయిన్ అంజలి స్పందన! లవ్ ప్రపోజల్స్, కారు గిఫ్టు‌పై హీరోయిన్ అంజలి స్పందించారు. అంజలి అప్పట్లో బిఎండబ్ల్యూ కారు కొనుక్కోవడం హాట్ టాపిక్ అయింది. ఆ కారు ఆమె కొన్నది కాదని, ఎవరో గిఫ్టుగా ఇచ్చారనే ప్రచారం జరిగింది...

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Actress Anjali is celebrating her birthday today, the 16th June, and her close friend and actor Jai, has tweeted a birthday note wishing her only the best.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X