»   » చిలుకలూరిపేట న్యూ మార్కెట్ యార్డ్ లో "జై సింహా" 100 రోజుల వేడుక

చిలుకలూరిపేట న్యూ మార్కెట్ యార్డ్ లో "జై సింహా" 100 రోజుల వేడుక

Posted By:
Subscribe to Filmibeat Telugu

సంక్రాంతికి విడుదలైన బాలకృష్ణ "జై సింహా" చిత్రం ఆ సమయంలో బరిలో నిలిచిన అన్ని సినిమాలను వెనక్కి నెట్టి విజేతగా నలిచింది. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సి.కె.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై సి.కళ్యాణ్ నిర్మించారు. బాలకృష్ణ సరసన నయనతార, హరిప్రియ, నటాషా దొషీ కథానాయికలుగా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 21కి వందరోజులు పూర్తి చేసుకొంటుంది.

ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఏప్రిల్ 22న గుంటూరు జిల్లాలోని చిలకలూరి పేట న్యూ మార్కెట్ యార్డ్ లో సాయంత్రం 5.00 గంటలకు వంద రోజుల వేడుక నిర్వహించనున్నారు చిత్రబృందం. దీని గురించి నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ.. "బాలయ్యబాబు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన "జై సింహా" ఏప్రిల్ 21వ తారీఖుకి వంద రోజులు పూర్తి చేసుకోనుండడం చాలా ఆనందంగా ఉందన్నారు.

Jai Simha 100 days function at Chilakuluri Peta on April 22nd

ఎమోషనల్ సీన్స్ లో ఏడిపించిన బాలయ్య, డ్యాన్సులతో విశేషంగా ఆకట్టుకొన్నారు. ముఖ్యంగా ఆయన ఈ సినిమాలో బ్రాహ్మణులను ఉద్దేశించి బాలయ్య చెప్పిన డైలాగ్ ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మా సంస్థలో బాలయ్యతో సినిమా తీద్దామని డిసైడ్ అయ్యాక కె.ఎస్.రవికుమార్ చెప్పిన కథ బాగా నచ్చింది. చిరంతన్ భట్ సంగీతం సినిమాకి హైలైట్ గా నిలిచిందని తెలిపారు.

నందమూరి అభిమానులు మాత్రమే కాక ప్రతి తెలుగు సినిమా ప్రేక్షకుడినీ "జై సింహా" విశేషంగా ఆకట్టుకొంది. అలాంటి సినిమా 100 రోజులు పూర్తి చేసుకోనుండడం చాలా ఆనందంగా ఉంది. ఆ ఆనందాన్ని అందరితో పంచుకోవడం కోసమే గుంటూరు జిల్లాలోని చిలకలూరి పేటలో న్యూ మార్కెట్ యాడ్ లో సాయంత్రం 5.00 గంటలకు 100 రోజుల వేడుక నిర్వహించనున్నాం. చిత్రబృందం అందరూ ఈ వేడుకల్లో పాల్గొననున్నారు" అన్నారు.

English summary
Jai Simha 100 days function at Chilakuluri Peta on April 22nd. Jai Simha is a 2018 Telugu action drama film, produced by C. Kalyan on C. K. Entertainments banner and directed by K. S. Ravikumar. It stars Nandamuri Balakrishna, Nayanthara, Natasha Doshi, Hariprriya in the lead roles. The music was composed by Chirantan Bhatt.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X