సీ కల్యాణ్ భారీ సాహసం.. లాభాల్లో పైసా తీసుకోను.. జై సింహాతో రిస్క్ చేస్తున్నాడా?
Recommended Video

నటసింహం నందమూరి బాలకృష్ణ 102వ చిత్రంగా వస్తున్న జై సింహా చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రముఖ తమిళ దర్శకుడు కేఎస్ రవికుమార్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల అవుతున్నది. నయనతార కీలక పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని సీకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మాత సీ కల్యాణ్ నిర్మిస్తున్నారు. అయితే జై సింహ రిలీజ్ విషయంలో సీ కల్యాణ్ భారీ రిస్క్ చేస్తున్నారనే మాట వినిపిస్తున్నది. అదేమింటంటే..

జై సింహా హక్కులు..
సూపర్‌స్టార్ గానీ, పెద్ద హీరోలతో సినిమాను తీసినప్పుడు నిర్మాతలు చాలా జాగ్రత్తగా బిజినెస్ వ్యవహారాలను చూసుకొంటారు. సీ కల్యాణ్ కూడా అలాంటి కోవకు చెందిన వారే. అయితే జై సింహా చిత్రంపై ఉన్న విశ్వాసంతో ఆయన పెద్ద సాహసానికి ఒడిగడుతున్నారట. ఈ చిత్రానికి సంబంధించిన పంపిణీ విషయంలో ఏకపక్షంగా ఉన్నారట.

అన్ని ప్రాంతాల్లో స్వయంగా
జై సింహా పంపిణీ హక్కులను, ఎగ్జిబిటర్ హక్కులను ఇప్పటి వరకు అమ్మకుండా అన్ని ప్రాంతాల్లోనూ స్వయంగా రిలీజ్ చేస్తున్నారట. అందుకు కారణం బాలయ్యపై, సినిమా కథపై ఉన్న విశేషంగా ఉన్న నమ్మకమేనని తన సన్నిహితులకు చెప్పినట్టు సమాచారం.

లాభాల్లో పైసా తీసుకోను..
ఇక జై సింహా సినిమాకు సంబంధించిన మరో విశేషమేమిటంటే.. ఈ చిత్రానికి వచ్చిన లాభాలను మొత్తం బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌కు అందజేస్తానని సీ కల్యాణ్ సంచలన ప్రకటన చేశారు. కల్యాణ్ ప్రకటనపై అభిమానులు, సినీ వర్గాలు హర్షం వ్యక్తం చేసున్నాయి.

సీ కల్యాణ్ రిస్క్ చేస్తున్నాడా?
నిర్మాత సీ కల్యాణ్ నిర్ణయం మంచిదే అని సినీవర్గాలు అంటున్నాయి. కానీ బాలకృష్ణ పైసా వసూల్ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తాపడిన నేపథ్యంలో జై సింహాపై అలాంటి సాహసాన్ని ఒడిగట్టవద్దని కొందరు సూచిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 12న రిలీజ్‌కు సిద్ధమవుతున్నది.


Click it and Unblock the Notifications











