»   » ఎన్టీఆర్ జై టీజర్ డిజిటల్ సునామీ... అవలీలగా కోటి!

ఎన్టీఆర్ జై టీజర్ డిజిటల్ సునామీ... అవలీలగా కోటి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ 'జై లవ కుశ' చిత్రానికి సంబంధించిన 'జై టీజర్' క్రియేట్ చేసిన డిజిటల్ సునామీ దెబ్బకు సౌతిండియా రికార్డులన్నీ బద్దలైన సంగతి తెలిసిందే. ఈ టీజర్ 24 గంటల్లో 7.8 మిలియన్ వ్యూస్ సాధించగా... 48 గంట్లోనే అవలీలగా 1 కోటి మార్కను అందుకుంది.

ఈ విషయాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ వారు అఫీషియల్ ట్విట్టర్ పేజీ ద్వారా ప్రకటించారు. సెన్సేషనల్ రెస్పాన్స్ తో జై టీజర్ ను రికార్డ్ బ్రేకింగ్ టీజర్ గా మార్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ టీజర్ తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.'జై లవ కుశ' మూవీలో ఎన్టీఆర్ 3 విభిన్నమైన పాత్రలు పోషిస్తున్నారు. అందులో జై క్యారెక్టర్ రావణుడి తరహాలో విలన్ పాత్రను పోలి ఉంటుంది. టీజర్లో ఎన్టీఆర్ తనదైన విలనిజాన్ని ప్రదర్శించి అభిమానులను మెప్పించారు.


బాబీ దర్శకత్వం వహిస్తెున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ట్స్ బేనర్లో నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్లో దసరా కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. జై టీజర్‌కు వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే ఎన్టీఆర్ కెరీర్లోనే మరో బిగ్గెస్ట్ హిట్ ఖాయంగా కనిపిస్తోంది.English summary
'Jai Lava Kusa' First Look Teaser fetched 1 crore digital views in less than 2 Days. This achievement was officially confirmed on NTR Arts Twitter Handle: '1 Crore Digital Videos in less than 48 hours for #RecordBreakingJaiTeaser. Thank you everyone for this sensational response'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu