»   » అక్కడి కంత్రీలు తనను గుర్తించక పోవడం జీర్ణించుకోలేక పోతున్న: జూ ఎన్టీఆర్!

అక్కడి కంత్రీలు తనను గుర్తించక పోవడం జీర్ణించుకోలేక పోతున్న: జూ ఎన్టీఆర్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

జూనియర్ ఎన్టీఆర్ అనగానే మన వాళ్లు ఒక ప్రభంజనంగా భావిస్తారు..కానీ జైపూర్ లో ఎన్టీఆర్ ను చూసి ఈ అబ్బాయి ఎవరు అంటూ అక్కడి ప్రజలు అడుగుతున్నారట. ఎన్టీఆర్ గురించి చెప్పడానికి తన ప్రక్కన ఉన్న రక్షకదళం ఈయన ఫలానా హీరో ఫలానా వారి మనుమడు అంటూ అక్కడి ప్రజలకు తెలియపరుస్తున్నారట. ప్రస్తుతం వైజయంతీమూవీస్ లో అశ్వనీదత్ నిర్మిస్తున్న 'శక్తి" చిత్ర నిమిత్తం జైపూర్ లో షూటింగ్ లో పాల్గొంటున్న ఎన్టీఆర్ ను అక్కడి ప్రేక్షకులు గుర్తుపట్టక పోవడం విశేషంగా భావిస్తున్నారు.

ఇక్కడి ఆయన అభిమానులు అలనాటి ఎన్టీఆర్ కి మనుమడు, స్టూడెంట్ నెం.1, సింహాద్రి, యమదొంగ లాంటి అదుర్స్ చిత్రాలతో త్వరలో టాలీవుడ్ నెం..కోసం పోరాడుతున్న ఈ అల్లరి రాముడ్ని అక్కడి కంత్రీలు గుర్తించక పోవడం జీర్ణించుకోలేక పోతున్నారు ఆయన అభిమానులు. ఇదిలా ఉంటే అసలు ఈ విషయాలు ఎన్టీఆర్ కు తెలియదట. అక్కడి ప్రజలు తనను బాగానే రిసివ్ చేసుకుంటున్నారని చెబుతున్నాడు..మన జూనియర్ అన్నట్లు త్వరలో పెళ్లి చేసుకోబోతున్న ఎన్టీఆర్, షూటింగ్ లో ఇలియానాతో మంచి రొమాంటిక్ సీన్స్ చేస్తూ చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడని సమాచారం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu