twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గుండమ్మ కథ విజయ ఢంకా మోగించిన చోటే, నా 11వ సినిమా ఇదే.. బాలయ్య ఎమోషనల్!

    |

    ఈ సంక్రాంతికి విడుదలైన బాలయ్య జై సింహ చిత్రం మంచి విజయం సాధించింది. తమిళ దర్శకుడు కె ఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన ఈచిత్రం నందమూరి అభిమానులని మెప్పించింది. కాగా ఆదివారం ఈ చిత్రం దిగ్విజయంగా 100 రోజులు పూర్తి చేసుకోవడం విశేషం. ఈ నేపథ్యంలో జై సింహా చిత్ర యూనిట్ గుంటూరు జిల్లా చిలకలూరి పేటలో శతదినోత్సవ వేడుకని జరుపుకోవడం విశేషం. ఈ వేడుకకు బాలయ్య, దర్శకుడు కె ఎస్ రవికుమార్, నిర్మాత సి కళ్యాణ్ తో పాటు ఏపీ మంత్రి పత్తిపాటి పుల్లారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలయ్య తన తండ్రి ఎన్టీఆర్ గురించి అద్భుతంగా ప్రసంగించడం విశేషం.

    బాలయ్య కెరీర్ లో 11వ చిత్రం

    బాలయ్య కెరీర్ లో 11వ చిత్రం

    బాలయ్య మాట్లాడుతూ.. శతదినోత్సవం జరుపుకుకుంటున్న తన 11 వ చిత్రం జైసింహా అని తెలిపారు. జై సింహా చిత్రం ఇంతటి ఘనవిజయం సాధించడానికి కారణమైన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు తన తండ్రే స్ఫూర్తి అని బాలయ్య అన్నారు. తండ్రిని అనుకరించే వాడు వారసుడు కాదని, ఆయనలా జీవించేవాడే నిజమైన వారసుడు అని తండ్రి ఎన్టీఆర్ ఎప్పుడూ చెబుతూ ఉండేవారని అన్నారు.

    Recommended Video

    'జై సింహ' ట్రైలర్.. బాలయ్య అదరగొట్టాడుగా !
    నిర్మాత, దర్శకుడి గురించి

    నిర్మాత, దర్శకుడి గురించి

    ఈ కాలంలో అభిరుచి గల నిర్మాతలు తగ్గిపోయారని అన్నారు. అభిరుచి కలిగిన కొద్దిమంది నిర్మాతల్లో సి కళ్యాణ్ ఒకరని బాలయ్య అన్నారు. తన అభిమానులు ఎలాంటి సినిమాలు ఆశిస్తారో తెలిసిన రచయిత రత్నం అని బాలయ్య అన్నారు. దర్శకుడు కె ఎస్ రవికుమార్ నటీనటుల నుంచి మంచి నటన రాబట్టుకున్నారని తెలిపారు.

    ఇక్కడే ఎందుకు

    ఇక్కడే ఎందుకు

    జై సింహా చిత్ర శత దినోత్సవ వేడుక ఇక్కడే జరుపుకోవాలనిపించిందని బాలయ్య అన్నారు. అందుకు గల కారణాన్ని కూడా ఆయన వివరించారు. తన తండ్రి నటించిన గుండమ్మ కథ, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వంటి చిత్రాల సత్తా దినోత్సవ వేడుకలు ఇక్కడే జరిగాయని అన్నారు. అందువలనే ఈ చిత్ర 100 రోజుల వేడుక ఇక్కడే నిర్వహించామని బాలయ్య అన్నారు.

    హీరోయిన్ల గురించి

    హీరోయిన్ల గురించి

    ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించిన నయనతార, హరిప్రియ, నటాషాకు బాలయ్య ధన్యవాదాలు తెలిపాడు. అమ్మ కుట్టి సాంగ్ కు జానీ మాస్టర్ అద్భుతమైన కొరియోగ్రఫీ అందించారని బాలయ్య ప్రశంసించారు.

    ఎన్టీఆర్ బయోపిక్ ప్రారంభించడానికి కారణం

    ఎన్టీఆర్ బయోపిక్ ప్రారంభించడానికి కారణం

    ఎన్టీఆర్ కొడుకుగా ఆయన పాత్రలో నటిస్తుండడం తన అదృష్టం అని బాలయ్య అన్నారు. ఎన్టీఆర్ చరిత్ర తెలుగుతెలుగు వారందరికీ మధుర జ్ఞాపకం. ఆ జ్ఞాపకం మరింత చేరువ కావాలనే ఉద్దేశంతోనే తాను ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని ప్రారంభించానని అన్నారు.

    పదేళ్ల తరువాత

    పదేళ్ల తరువాత


    చిత్ర దర్శకుడు కె ఎస్ రవికుమార్ మాట్లాడుతూ తాను పదేళ్ల తరువాత సత్తా దినోత్సవ వేడుక చూస్తున్నా అని ఆ అవకాశం కల్పించిన అభిమానులకు కృతజ్ఞతలు అని రవికుమార్ అన్నారు. 100 రోజుల వేడుకలు కనుమరుగై పోయాయని అంటున్న సమయంలో ఇంకా ఉంది అని నిరూపించారని అన్నారు. బాలయ్యతో మళ్ళీ మళ్ళీ సినిమా చేయాలని ఉందని అన్నారు.

    English summary
    JaiSimha 100 days function. Balakrishna remembers NTR
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X