»   » ఎన్టీఆర్ జక్కన్నకి టైం ఇచ్చాడు... మరి రిలీజ్ ఎప్పుడు?

ఎన్టీఆర్ జక్కన్నకి టైం ఇచ్చాడు... మరి రిలీజ్ ఎప్పుడు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

'జనతా గ్యారేజ్' సినిమా విడుదల వాయిదా పడటంతో, కొన్ని సినిమాలు తమ విడుదల తేదీలను మార్చుకుంటూ ఉంటే, మరికొన్ని సినిమాలు కొత్తగా రంగంలోకి దిగుతున్నాయి. ఇది సరైన సమయమనుకుని వస్తోన్న సినిమాల్లో 'జక్కన్న' కూడా చేరిపోయింది. వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో సునీల్ కథానాయకుడిగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాను ఈ నెల 29న విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.

సునీల్ హీరోగా, మన్నార్ చోప్రా హీరోయిన్ గా, ప్రేమ‌క‌థాచిత్ర‌మ్ త‌రువాత ఆర్.పి.ఎ.క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.2గా రూపొందుతోన్న చిత్రం 'జక్కన్న' షూటింగ్ కార్క‌క్ర‌మాలు పూర్తిచేసుకుంది.ఇప్ప‌టికే పోస్ట్‌ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.ఇటీవలే ఈ చిత్రానికి సంభందించి ఆడియోని మెగాస్టార్ చిరంజీవి గారి చేతుల‌మీదుగా వచ్చిన ఆడియో కూడా మంచి రెస్పన్స్ నే తెచ్చుకుంది.


Jakkanna release on 29 July

ధియోట్రిక‌ల్ ట్రైల‌ర్ కి కూడాచాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అందుకే మరీ ఆలస్యం చేయకుండా తొందరగా రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారట. సునీల్ బ్యాక్ టు ఎంట‌ర్‌టైన్‌మెంట్ అంటూ సోష‌ల్ మీడియా లో ట్రెండ్ గా నిల‌వ‌టం కూడా సినిమా మీద ఉన్న అంచనాలు పర్వాలేదన్నట్టుగానే అనిపిస్తోంది.


ఆమధ్య వచ్చిన హర్రర్ సినిమా "ర‌క్ష" చిత్రం ద‌ర్శ‌కుడు వంశీ కృష్ణ అకెళ్ళ దర్శకత్వంలో ఆర్.సుదర్శన్ రెడ్డి ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మించారు. దినేష్ సంగీత ద‌ర్శ‌కుడు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సుదర్శన రెడ్డి మాట్లాడుతూ, ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో, సునీల్ జోడీగా మన్నారా చోప్రా నటించిందని చెప్పాడు. ఈ సినిమాకి కామెడీ .. పంచ్ డైలాగ్స్ .. దినేష్ అందించిన సంగీతం హైలైట్ గా నిలుస్తాయని అన్నాడు. ఈ సినిమాను తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉందని చెప్పాడు.

English summary
According to the latest update from the movie’s unit, Jakkanna has been confirmed for a July 29th release
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu