»   » జల్లికట్టుకు జడిసిన ‘సింగం 3’, మరోసారి సినిమా రిలీజ్ వాయిదా!

జల్లికట్టుకు జడిసిన ‘సింగం 3’, మరోసారి సినిమా రిలీజ్ వాయిదా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సూర్య నటించిన 'సింగం-3' చిత్రం మరోసారి వాయిదా పడింది. జనవరి 26న సినిమాను రిలీజ్ చేయాలని అంతా సిద్ధం అయిన వేళ తమిళనాడులో జల్లికట్టు ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడటంతో ఇది సినిమా విడుదలకు సరైన సమయం కాదని భావించిన నిర్మాతలు సినిమా విడుదలను నిలిపి వేసారు.

వాస్తవానికి 'సింగం 3' చిత్రం గతేడాది డిసెంబర్ మొదటి వారంలోనే విడుదల కావాల్సి ఉంది. అయితే తమిళనాడులో తుఫాన్ ఎఫెక్టుతో సినిమా విడుదల నిలిపేసారు. తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణం కూడా సినిమా విడుదలను మరోసారి వాయిదా పడేలా చేసింది.

Jallikattu effect: Singam 3 postponed again

పరిస్థితి సద్దుమనిగింది అనుకుంటున్న వేళ 'జల్లికట్టు' ఉద్యమం రూపంలో సినిమాకు ఆటంకం ఏర్పడింది. సూర్య , శ్రుతిహ‌స‌న్‌, అనుష్క‌లు జంట‌గా నటిస్తున్న చిత్రం "S3-య‌ముడు-3". ఈ చిత్రానికి హ‌రి ద‌ర్శ‌కుడు. ఈ చిత్రాన్నిస్టూడియో గ్రీన్‌ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్‌రాజా స‌గ‌ర్వంగా స‌మ‌ర్పిస్తూ తెలుగులో సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత మల్కాపురం శివకుమార్‌ నిర్మిస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత‌ మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ.. త‌మిళ‌, తెలుగు బాష‌ల్లో ఈనెల 26 న విడుద‌ల కావ‌ల‌సిన "S3-య‌ముడు-3 చిత్రం విడుద‌ల వాయిదా వేశాము. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఏక‌కాలంగా విడుద‌ల చేయ‌టానికి ప్లాన్ చేసిన ఈ చిత్రం ప్ర‌స్తుతం జ‌ల్లిక‌ట్టు నేప‌ధ్యంలో త‌మిళ‌నాట కొన‌సాగుతున్న ప‌రిస్థితుల్ని గ‌మ‌నించి, ఇది విడుద‌ల‌కి స‌రియైన స‌మ‌యం కాద‌ని త‌ల‌చి ఈ నిర్ణ‌యం తీసుకొవ‌టం జ‌రిగింది అన్నారు.

డైర‌క్ట‌ర్ హ‌రి గారు , సూర్య గారి కాంబినేష‌న్ లో వ‌చ్చే చిత్రం కొసం తమిళ‌, తెలుగు ప్రేక్షుకులు ఏ విధంగా ఎదురుచూస్తుంటారో అంద‌రికి తెలుసు.. కాని ప‌లు కార‌ణాల వ‌ల‌న ఈ చిత్రం విడుద‌లని ఏప్ప‌టిక‌ప్ప‌డు వాయిదా వేసుకుంటూ వ‌స్తున్నాం. రెండు రాష్ట్రాల్లో అన్ని ప‌రిస్థితులు అనుకూలంగా వున్న టైంలో చిత్రాన్ని విడుద‌ల చేస్తాం. మా త‌దుప‌రి విడుద‌ల తేది ని అతిత్వ‌ర‌లో తెలియ‌జేస్తాం.. అని నిర్మాత తెలిపారు.

English summary
Singam 3 postpone the release once again as Tamil Nadu is currently witnessing massive protests by youths to lift the ban on Jallikattu.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu