For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘జంబల‌కిడిపంబ‌’ అదిరిపోయే కాన్సెప్ట్.. శ్రీనివాసరెడ్డికి తిరుగులేదు.. హీరో నాని

  By Rajababu
  |

  శ్రీనివాస్‌రెడ్డి, సిద్ధి ఇద్నాని హీరో హీరోయిన్లుగా శివం సెల్యూలాయిడ్స్‌, మెయిన్ లైన్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్స్‌పై జె.బి.ముర‌ళీ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ర‌వి, జో జో జోస్‌, శ్రీనివాస్ రెడ్డి.ఎన్ నిర్మిస్తున్న చిత్రం జంబ ల‌కిడి పంబ‌. ఈ సినిమా టీజర్ ను హీరో నాని గురువారం హైదరాబాద్ లో విడుద‌ల చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో హీరో శ్రీనివాస్‌రెడ్డి , నిర్మాతలు ర‌వి, జో జో జోస్‌ , ద‌ర్శ‌కుడు జె.బి.ముర‌ళీ కృష్ణ‌, స‌హ నిర్మాత బి.సురేశ్ రెడ్డి,లైన్ ప్రొడ్యూస‌ర్‌ స‌ంతోష్‌ సహా చిత్ర యూనిట్ స‌భ్యులు పాల్గొన్నారు.

   హిట్టు కొట్టడం ఖాయం

  హిట్టు కొట్టడం ఖాయం

  హీరో నాని మాట్లాడుతూ - " ఈవీవీగారి `జంబల‌కిడిపంబ‌` నా ఫేవరెట్ సినిమాల్లో ఒకటి. అదే టైటిల్ తో సినిమా అనగానే ,అలాంటి కాన్సెప్ట్ మళ్ళీ రావడం కష్టం కదా ఎలా అనుకున్నాను. కానీ వీళ్ళకి అదిరిపోయే కాన్సెప్ట్ దొరికింది . కరెక్టుగా టైటిల్ కూడా బాగా మ్యాచ్ అయ్యింది. మనం ఇప్పటివరకూ తెలుగు తెరపై చూడని కాన్సెప్ట్ ఇది. చాలా ఫన్ గా,సరదాగా చేసినట్టు అనిపిస్తోంది. టీజర్ చూస్తుంటే కచ్చితంగా హిట్ కొడతారనిపిస్తోంది అని అన్నారు.

  శ్రీనివాస్ రెడ్డికి తిరుగులేదు

  శ్రీనివాస్ రెడ్డికి తిరుగులేదు

  ఇక శ్రీనివాస రెడ్డి చేస్తే తిరుగేముంది !నాకిష్టమైన నటుల్లో ఆయన ఒకరు. ఆయన కామెడీ టైమింగ్ అంటే ఫస్ట్ నుంచి నాకిష్టం. ఆయన ఫ్రేమ్ లో ఉన్నారంటే ఎంటర్టైన్మెంట్ గారంటీ . నాలుగైదు సీన్స్ లో కనిపించినా ఆ ఇంపాక్ట్ వేరేలా ఉంటుంది. అలాంటిది ఆయన సినిమా మొత్తం ఉన్నారంటే `జంబల‌కిడిపంబ‌` ఏ స్థాయిలో ఉంటుందో అర్ధం చేసుకోండి. ఈ టీజర్ ని రిలీజ్ చేయడం హ్యాపీగా ఉంది. `జంబల‌కిడిపంబ‌` బ్లాక్ బస్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను " అన్నారు.

   హీరో నాని చేతుల మీదుగా

  హీరో నాని చేతుల మీదుగా

  హీరో శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ - ``మా సినిమా టీజర్ ను నాని గారు విడుద‌ల చేయ‌డం ఆనందంగా ఉంది. సినిమా త‌ప్ప‌కుండా అంద‌రినీ మెప్పించేలా ఉంటుంది `` అన్నారు. నిర్మాత ర‌వి మాట్లాడుతూ - ``శ్రీనివాస్ రెడ్డిగారు హీరోగా న‌టించిన ఈ చిత్రం టీజర్ ను నాని గారు విడుద‌ల చేయ‌డం ఆనందంగా ఉంది. సినిమా చాలా బాగా వ‌స్తుంది. త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కులంద‌రికీ నచ్చుతుంది`` అన్నారు.

  టైటిల్‌తో కొత్త కోణం

  టైటిల్‌తో కొత్త కోణం

  ద‌ర్శ‌కుడు జె.బి.ముర‌ళీ కృష్ణ మాట్లాడుతూ - ```జంబ ల‌కిడి పంబ‌` సినిమా క‌ల్ట్ మూవీ. ఇందులో `జంబ ల‌కిడి పంబ‌` అనే ప‌దానికి అర్థం లేదు. కానీ అదే టైటిల్‌గా పెట్టిన ఈ సినిమాతో ఈవీవీగారు కామెడీలో కొత్త కోణాన్ని చూపారు. అప్ప‌టి సినిమాకు.. ఇప్పుడు మేం చేసిన సినిమాకు సంబంధం లేదు. క‌థ‌కు సూట్ అవుతుంద‌నిపించి ఈ టైటిల్‌ను పెట్టాం`` అన్నారు.

  న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు

  న‌టీన‌టులు: పోసాని కృష్ణ‌ముర‌ళి, వెన్నెల కిశోర్ ,స‌త్యం రాజేశ్‌, ధ‌న్‌రాజ్‌, ష‌క‌ల‌క శంక‌ర్‌, హ‌రి తేజ‌, రాజ్య‌ల‌క్ష్మి, హిమ‌జ‌, కేదారి శంక‌ర్‌, మ‌ధుమ‌ణి, మిర్చి కిర‌ణ్‌, జ‌బ‌ర్ద‌స్త్ అప్పారావు, స‌న‌, సంతోష్‌, గుండు సుద‌ర్శ‌న్‌, జ‌బ‌ర్ద‌స్త్ ఫ‌ణి త‌దిత‌రులు.
  సాంకేతిక నిపుణులు: సంగీతం: గోపీసుంద‌ర్‌, కెమెరా: స‌తీశ్ ముత్యాల‌, ఆర్ట్: రాజీవ్ నాయ‌ర్‌, ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: జె.బి.ముర‌ళీకృష్ణ (మ‌ను), నిర్మాత‌లు: ర‌వి, జోజో జోస్‌, శ్రీనివాస‌రెడ్డి.ఎన్‌., స‌హ నిర్మాత‌: బి.సురేశ్ రెడ్డి, లైన్ ప్రొడ్యూస‌ర్‌: స‌ంతోష్‌.

  English summary
  The Teaser of Srinivas Reddy starrer Jamba Lakidi Pamba was released today by actor Naani. The cast and crew of the film were also present. Actor Naresh was the hero of Jamba Lakidi Pamba which was released in 1993. Nani said This movie is coming with good concept. EVVs Jamba Lakidi Pamba is one of my favorites.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X