»   » అలరి నరేష్ పెళ్లి కానుక కావాలి (ఫోటో ఫీచర్)

అలరి నరేష్ పెళ్లి కానుక కావాలి (ఫోటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అల్లరి నరేస్, సాక్షి చౌదరి హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం ‘జేమ్స్ బాండ్'. నేను కాదు నా పెళ్లాం అనేది సబ్ కాప్షన్. ఎ.కె.ఎంటర్టెన్మెంట్స్ ప్రై.లి బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయి కిషోర్ మచ్చ దర్శకత్వం వహించగా, సాయి కార్తీక్ సంగీతం అందించారు.

ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల ముఖ్య అతిథిగా హాజరై సీడీలను ఆశిష్కరించారు. తొలి సీడీ నటుడు శ్రీకాంత్ అందుకున్నారు. ఈ కార్యక్రమంలో రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, నాని, సుధీర్ బాబు, వీరభద్రం, తరుణ్, అమ్మిరాజు, రామజోగయ్య శాస్త్రి, దశరత్, సంతోష్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

అలరి నరేష్ తరహా కామెడీ మార్కుతో ఈ సినిమా పూర్తి వినోదాత్మంగా రూపొందించారు. ఆడియో విడుదల సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ....ఈ చిత్రం అల్లరి నరేష్ పెళ్లి కానుక కావాలని, పెద్ద విజయం సాధించాలని ఆకాక్షించారు.

ఆడియో వేడుకకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో...

ఆడియో సీడీలు

ఆడియో సీడీలు


ఈ ఆడియో వేడుకకు శ్రీను వైట్ల ముఖ్య అతిథిగా హాజరైన సీడీలను ఆవిష్కరించారు.

నరేష్

నరేష్


అల్లరి నరేష్ కు ఈ చిత్రం పెళ్లి కానుకలా ఉండాలని, పెద్ద హిట్ కావాలని వక్తలు ఆకాంక్షించారు.

స్టార్స్

స్టార్స్


ఈ కార్యక్రమంలో రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, నాని, సుధీర్ బాబు, వీరభద్రం, తరుణ్, అమ్మిరాజు, రామజోగయ్య శాస్త్రి, దశరత్, సంతోష్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

నటీనటులు

నటీనటులు


ఈ చిత్రంలో ఆశిష్ విద్యార్థి, చంద్రమోహన్, జయప్రకాష్ రెడ్డి, రఘుబాబు, కృష్ణ భగవాన్, పోసాని తదితరులు నటించారు.

తెర వెనక

తెర వెనక


ఈ చిత్రానికి మాటలు: శ్రీధర్ సీపాన, పాటలు: రామజోగయ్యశాస్త్రి, విశ్వ, భువనచంద్ర, ఆర్ట్: కృష్ణమాయ, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, సంగీతం: సాయి కార్తీక్, నిర్మాత: రామసుబ్రహ్మణ్యం, దర్శకత్వం: సాయి కిసోర్ మచ్చ.

English summary
Telugu Movie James Bond Audio Launch event held at Hyderabad.
Please Wait while comments are loading...