»   » బాహుబలి ఎఫెక్టే: అల్లరి నరేష్ సినిమా మళ్లీ వాయిదా

బాహుబలి ఎఫెక్టే: అల్లరి నరేష్ సినిమా మళ్లీ వాయిదా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అల్లరి నరేష్ తాజా చిత్రం ‘జేమ్స్ బాండ్' చిత్రం ఈ నెల 17 విడుదల చేయాలనుకున్నారు. అయితే ‘బాహుబలి' సినిమాకు డిమాండ్ బాగా ఉండటంతో మరో వారం కూడా కంటిన్యూ చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో అల్లరి నరేష్ ‘జేమ్స్ బాండ్' మూవీ వాయిదా వేయాలని నిర్ణయించినట్లు సమాచారం. జులై 24న విడుదలయ్యే అవకాశం ఉంది.

అల్లరి నరేస్, సాక్షి చౌదరి హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం ‘జేమ్స్ బాండ్'. నేను కాదు నా పెళ్లాం అనేది సబ్ కాప్షన్. ఎ.కె.ఎంటర్టెన్మెంట్స్ ప్రై.లి బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయి కిషోర్ మచ్చ దర్శకత్వం వహించగా, సాయి కార్తీక్ సంగీతం అందించారు.


James Bond movie postponed again!

ఈ చిత్రంలో ఆశిష్ విద్యార్థి, చంద్రమోహన్, జయప్రకాష్ రెడ్డి, రఘుబాబు, కృష్ణ భగవాన్, పోసాని తదితరులు నటించారు. ఈ చిత్రానికి మాటలు: శ్రీధర్ సీపాన, పాటలు: రామజోగయ్యశాస్త్రి, విశ్వ, భువనచంద్ర, ఆర్ట్: కృష్ణమాయ, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, సంగీతం: సాయి కార్తీక్, నిర్మాత: రామసుబ్రహ్మణ్యం, దర్శకత్వం: సాయి కిసోర్ మచ్చ.

English summary
Comedy king Allari Naresh’s James Bond movie is supposed to release on July 17th but it seems that the release date of this movie was postponed yet again.
Please Wait while comments are loading...