»   » 16 ఏళ్లకే గర్భం దాల్చి శిక్ష వేసుకున్నాను: కంట తడి పెట్టిన నటి

16 ఏళ్లకే గర్భం దాల్చి శిక్ష వేసుకున్నాను: కంట తడి పెట్టిన నటి

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రఖ్యాత పాప్ గాయని బ్రిట్నీ స్పియర్స్ చిన్న చెల్లెలు జెమీ లిన్‌ స్పియర్స్‌. హాలీవుడ్ లో బాలనటి గా అడుగుపెట్టింది. సరిగ్గా కెరీర్ ఊపందుకుంటున్న దశలోనే 16 ఏళ్లకే నేను ఇప్పుడు గర్భవతిని అని చెప్పి ఆమె సినీ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. చిన్న వయస్సులోనే తల్లి అవటం వల్ల ఆమె చాలాకాలమే నటనకు దూరంగ ఉందాల్సి వస్తుంది.

ఒకప్పుడు చైల్డ్ స్టార్‌గా, బ్రిట్నీ సోదరిగా పతాక శీర్షికలకు ఎక్కిన ఆమె ఇప్పుడు కంటతడి పెడుతూ. 16 ఏళ్లకే గర్భం దాల్చటం,ఒక బిడ్డకి జన్మనివ్వటం ఎంతటి భాదాకరమైన పరిణామమో వివరించింది.టీఎల్సీ అనే టీవీ చానెల్‌లో ప్రసారమయ్యే "ది లైట్స్ గో ఔట్‌" అనే ఒక షోలో ప్రస్తుతం 25 ఏళ్ల వయసులో ఉన్న ఆమె టీనేజ్‌లో తాను గర్భం దాల్చడం వల్ల ఎదురైన చేదు అనుభవాలను యాంకర్ తో పంచుకుంది.

"16 ఏళ్లకే నేను గర్భవతిని అయ్యాను. హాలీవుడ్ చైల్డ్ స్టార్ తల్లి కాబోతున్నదని,నా గర్భం గురించి, నా ప్రవర్తన గురించి ఎన్నెన్నో కథనాలు రాశారు. నువ్వు గర్భవతి అంటూ ఎంతోమంది ముఖం మీద అన్నారు. ఇప్పుడు వెనుదిరిగి చూసుకుంటే.. ఓహ్..గాడ్..!ఇదంతా ఏమిటీ? అన్న భావన కలుగుతుంది" అంటూ ఆమె వివరించింది.

Jamie Lynn Spears Breaks Down In Tears Over Teen Pregnancy

లిన్‌ తల్లిదండ్రులు కూడా తమ బిడ్డ చిన్నవయస్సులో గర్భవతి కావడం వల్ల తాము అనుభవించిన క్షోభను వివరించారు. ఒక టీనేజ్ లో ఉన్న అమ్మాయి గర్భం దాలిస్తే ఆ కుటుంబం లో ఎంతటి అనిశ్చిత స్థితికి లోనౌతుందో. ఆ అమ్మాయి ఆరోగ్యం,సామాజిక జీవితం మీద ఆ సంఘతన ఎంతటి ప్రభావం చూపుతుందో తమ జీవితమే ఒక ఉదాహరణ గా దేవుడు చూపించాడనీ చెప్పారు.

25 ఏళ్ల లిన్‌కు ఇప్పుడు 8 ఏళ్ల కూతురు ఉంది. ఈ విషయంలో ఆమె తన అనుభవాలను వివరిస్తూ సాగే డాక్యుమెంటరీ త్వరలో టీఎల్సీలో ప్రసారం కానుంది.

English summary
Jamie Lynn Spears breaking down in tears as she discussed her teen pregnancy.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu