»   » చెత్త: బాహుబలిపై అలనాటి నటి సంచలన వ్యాఖ్య

చెత్త: బాహుబలిపై అలనాటి నటి సంచలన వ్యాఖ్య

Posted By:
Subscribe to Filmibeat Telugu

రాజమండ్రి: అందరి మన్ననలు అందుకున్న బాహుబలి సినిమాపై అలనాటి నటి జమున సంచలన ప్రకటన చేశారు. బాహుబలి ఓ చెత్త సినిమా అని అందులో హీరో తప్ప, కథ ఎక్కడుందని వ్యాఖ్యానించారు.
రాజమండ్రిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళిన జమున మీడియా సమావేశంలో ఆ వ్యాఖ్యలు చేశారు.

తన మనవడి ప్రోద్భలంతోనే బాహుబలిని చూశానని ఈ సీనియర్ నటి తెలిపారు. తాను సినిమాలు చూడటం మానేసి చాలా కాలమైందని, నా మనుమడి ప్రోద్బలంపై 'బాహుబలి' చూశానని చెప్పారు.

Jamuna makes controversial comments on Baahubali

అదో స్టుపిడ్ సినిమా అని, ఈ పదానికి సరైన అర్థం ఏదైనా ఉంటే అది ఉపయోగించాలని అన్నారు. సాంకేతిక విలువలు తప్ప సినిమాలో ఏమీ లేని ఆమె అన్నారు. 'బాహుబలి' లో ఒక్క హీరో పాత్ర తప్ప, మిగతా పాత్రల ఎంపిక సరిగా జరగలేదని దుయ్యబట్టారు అనుష్కను హీరోయిన్‌గా ఎంపిక చేయాల్సిందని అన్నారు.

తెలుగు సినీ ప్రపంచంలో జమున అందాల తారగా ఒక వెలుగు వెలిగారు. ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వర రావు వంటి దిగ్గజాల పక్కన ఆమె హీరోయిన్‌గా చేసి ప్రేక్షకులను మెప్పించారు.

English summary
Actress Jamuna made controversial comments against Baahubali film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu