»   » యే మేరా జహా, నారాజు గాకురా ఓరన్నయో... అంటున్న పవన్ కళ్యాణ్!

యే మేరా జహా, నారాజు గాకురా ఓరన్నయో... అంటున్న పవన్ కళ్యాణ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ 'దేశ్ బచావో' మ్యూజిక్ ఆల్బమ్ లో మరో రెండు పాటులు రిలీజ్ అయ్యాయి. ఉదయమ ట్రావెలింగ్ సోల్జర్ అంటూ ఓ పాట విడుదల చేయగా... తర్వాత యే మేరా జహా, నారాజు గాకురా ఓ రన్నయో అంటూ మరో రెండు పాటలు రిలీజ్ చేసారు.

Jana Sena Desh Bachao: Naarazu Gakura, Ye Mera Jaha remix songs

జనసేన పార్టీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ పాటలు రిలీజ్ చేసారు. ఇవన్నీ పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు, ఖుషి, జానీ చిత్రాల్లోని పాటల రీమేక్స్ కావడం విశేషం. అప్పట్లో అభిమానులను, ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఈపాటలనే లిరిక్స్ మార్చి జనాల్లో చైతన్యం నింపే సాహిత్యంతో రీమిక్స్ చేసారు.

ఈ పాటలు ఇది యువతలో భావోద్వేగాలను నింపుతుందని, యువతకు స్పూర్తి కలిగేలా చేస్తుందని పవన్ ట్విట్టర్ ద్వారా అభిప్రాయపడ్డారు. వైజాగ్ ఆర్కే బీజ్ లో జరిగే ఏపీ స్పెషల్ స్టేటస్ కోసం జరిగే ఉద్యమంలో ఈ పాటలే మారుమ్రోగబోతున్నాయి.

English summary
Jana Sena party Desh Bachao movement songs released. The song "Ye Mera Jaha - EDM Mix" is inspired from the song "Ye Mera Jaha" from the movie "Khushi", composed by Mani Sharma. The Remix song "Naarazu Gakura" is inspired from the song "Naarazu gakura" originally composed by Ramana Gogula for the movie "Johnny" which released in the year 2003.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu