twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఒబామా హీరోగా తెలుగు చిత్రం

    By Srikanya
    |

    త్వరలో 'ఓం ఒబామా"అనే కామిడీ చిత్రం తెలుగులో రాబోతోంది.గతంలో జాతీయ అవార్డందుకున్న తమిళ దర్శకురాలు జానకీ విశ్వనాధన్‌ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు. 'ఓం ఒబామా' టైటిల్ తో రూపొందే ఓ కామిడీ చిత్రాన్ని తెరకెక్కించినట్లు మీడియాకు తెలిపారు. ఒబామా భారత పర్యటనలో భాగంగా తమిళనాట ఓ మారుమూల గ్రామానికి వస్తున్నట్లు జరిగిన ప్రచారానికి అక్కడ వర్గాలుగా విడిపోయిన రాజకీయ నేతలు, గ్రామస్తులు ఆయనకి ఎలా స్వాగతం చెప్పాలన్న విషయంపై జరిగిన వాదోపవాదాల నేపధ్యంలో ప్రతి గ్రామాన 'ఓం నమ: శివాయ:' అన్నట్లే ' ఓం ఒబామా' అన్న నినాదం ఎలా? పుట్టింది? దీన్ని పుట్టించినదెవరనే విషయాలపై నూతన తారలతో పూర్తి స్ధాయి కామెడీ తో రూపొందించారని చెప్తున్నారు.

    తమిళంతో పాటు తెలుగు వెర్షన్‌ కూడా పూర్తి చేసి త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగులోనూ ఈ చిత్రానికి 'ఓం ఒబామా'నే రిజిష్టర్‌ చేయించినట్లు చెప్పారామె. గెడరపాళయంలో ఇద్దరు రాజకీయ నాయకులు ఎన్నికల్లో పోటీ పడుతారు. ప్రచార సమయంలో ఇరువర్గాల మధ్య వివాదం ఏర్పడుతుంది. ఆ సమయంలో విదేశాల నుంచి ఒక మహిళా విలేకరి అక్కడికి వస్తుంది. దీంతో అమెరికా అధ్యక్షుడు ఒబామా కూడా ఆ ఊరికి రాబోతున్నారనే ప్రచారం జరుగుతుంది. ఆయన్ని ఎలా ఆహ్వానించాలనే విషయమై ఇద్దరు రాజ కీయ నాయకులు గొడవపడుతారు. అసలు ఆ ఊరికి ఒబామా వచ్చాడా? చివరికి ఆ గ్రామం పరిస్థితి ఏమిటి? అనేది చిత్రకథ.తిరుపూర్‌లోని వస్త్రపరిశ్రమపై ఆర్థిక మాంద్య ప్రభావం గురించి ఇంటర్నెట్‌లో ఈమె చదివిన ఒక వ్యాసం కూడా ఈ చిత్రం దిశగా ప్రేరణనిచ్చినట్లు తెలుస్తోంది.

    English summary
    After winning the National Award for her first film, ‘Kutty’ (2001), a story based on author Sivasankari's novel, director Janaki Vishwanathan, went on to direct ‘Kanavu Mei Pada Vaendum’ in 2004. After a 7-year hiatus where she was directing a few short films, Janaki is back with ‘Om Obama’, which is currently in its final stages of production.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X