»   » జనతా గ్యారేజ్ ఆడియో రిలీజ్ ఫిక్సయ్యింది: కానీ ఇక్కడ కాదట

జనతా గ్యారేజ్ ఆడియో రిలీజ్ ఫిక్సయ్యింది: కానీ ఇక్కడ కాదట

Posted By:
Subscribe to Filmibeat Telugu

అటు నాన్నకు ప్రేమతో సందడి ముగియకుండానే జనతా గ్యారేజ్ షూటింగ్ స్టార్ట్ అయినట్టుంది గానీ సినిమా రిలీజ్ కు మాత్రం ఇక మూడు నెలలు మాత్రమే మిగిలుంది. షూటింగ్ కూడా దానికి తగ్గట్టే వేగంగానే జరుగుతోంది. మరో వైపు సినిమా కు సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్లు ఎప్పుడు రిలీజ్ అవుతాయా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఎన్టీఆర్ పుట్టినరోజు మే 20న కావడంతో, ఆ రోజున ఫస్టులుక్ ను రిలీజ్ చేయాలనే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నట్టుగా సమాచారం. అలాగే మే 28న మహానటుడు ఎన్టీ రామారావు జయంతి కావడంతో, ఆ సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ సినిమా ఫస్టు టీజర్ ను రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట.


ఈ సినిమా ఆడియో వేడుకను జూలై 15న ఘనంగా నిర్వహించాలనే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నారనేది తాజా సమాచారం. దాదాపు అదే తేదీ ఖరారు కావొచ్చని అంటున్నారు. ఈ చిత్ర ఆడియో ని ఈ చిత్ర యూనిట్ గ్రాండ్ గా రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు.ఈ చిత్ర ఆడియో ని యూఎస్ లో రిలీజ్ చెయ్యాలని ఈ చిత్ర నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు అని ఫిలిం నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఇంకా ఈ విశయంలో ఒక నిర్ణయానికి రాలేదట.


Janata Garage Audio Release date Considered

యూఎస్ లో ఈ ఆడియో రిలీజ్ ఈవెంట్ కి తెలుగు ఆడియన్స్ భారీగా అటెండ్ అవ్వబోతున్నారు. యూఎస్ లో ఆడియో రిలీజ్ వేడుక జరిగినా కూడా ఈ చిత్ర ఆడియో ని హైదరాబాద్ లో కూడా లోకల్ ఫాన్స్ ని ఆనంద పరిచేలా చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారట.


ఎన్టీఆర్ సరసన సమంతా,నిత్యామీనన్ కథానాయికలుగా అలరించనున్నారు. ఇక మలయాళ స్టార్ మోహన్ లాల్ ఒక కీలకమైన పాత్రను పోషిస్తోన్న సంగతి తెలిసిందే. ఆగస్టు 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది .

English summary
According to the latest sources, Janata Garage makers are planning the audio release events in US
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu