»   »  ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’ సరికొత్త రికార్డ్

ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’ సరికొత్త రికార్డ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఎన్టీఆర్ నటించిన ‘నాన్నకు ప్రేమతో' చిత్రం ఇటీవల విడుదలై ఓవర్సీస్ మార్కెట్లో మంచి ఫలితాలు సాధించిన సంగతి తెలిసిందే. ఇక్కడ ఈ చిత్రం దాదాపుగా 2 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఈ కలెక్షన్ల ఎఫెక్టు...ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జనతా గ్యారేజ్' చిత్రంపై పడింది.

సాధారణంగా ఎన్టీఆర్ సినిమాలు ఓఎవర్సీస్ లో రూ. 5 కోట్ల మించి అమ్ముడుపోయిన దాఖలాలు లేవు. అయితే ‘జనతా గ్యారేజ్' చిత్రానికి మాత్రం రూ. 7 కోట్లు ఇస్తానని ఓ బయ్యర్ డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి నాన్నకు ప్రేమతో సినిమా తర్వాత ఎన్టీఆర్‌ కు ఫాలోయిగ్ ఏ రేంజిలో అర్థం చేసుకోవచ్చు.

Janata Garage Sets New Record For NTR

జనతా గ్యారేజ్ అనేది ప్రస్తుతానికి వర్కింగ్ టైటిల్ మాత్రమే. ఈ మూవీ కోసం హైద్రాబాద్ సారధి స్టూడియోస్ లో భారీ సెట్ వేస్తున్నారు. ఎన్టీఆర్ వర్క్ చేయబోయే జనతా గ్యారేజ్ పేరుగల మెకానిక్ షెడ్ ని దాని చుట్టుపక్కలుండే ప్రాంతాలను సెట్ వేస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ ఇప్పటికే సెట్ నిర్మాణ పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాడు.

ఫిబ్రవరి మెదటివారంలో మెదలయ్యే అవకాశం వుందని సమాచారం. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొత్త లుక్ తో కనిపిస్తారని, ఇందులో మెకానిక్ గా ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ డిఫరెంటుగా ఉంటుందని అంటున్నారు. జనతా గ్యారేజ్ లో కీలకపాత్రలో మెహన్ లాల్ నటించబోతున్న సంగతి తెలిసిందే. కేరళనుండి మరో యంగ్ హీరో నటించబోతున్నారని సమాచారం. ఎన్టీఆర్ సినిమాలో ఇతని పాత్రకు కూడా ఎక్కువ ప్రాధాన్యం ఉండే అవకాశం వుందని తెలుస్తోంది. అతను మరెవరో కాదు కేరళ స్టార్ హీరో అయిన ఫహాద్ ఫాజిల్.

English summary
NTR films are bought for under 5 crore in overseas but Nannaku Prematho’s phenomenal success in overseas, Janata Garage has set a new record as it fetched 7 crore from this area.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu