»   » ఎన్టీఆర్ పై చెన్నై లో ఉప్పొంగిన అభిమానం : మూడు కిలో మీటర్ల మేర స్తంబించిన ట్రాఫిక్

ఎన్టీఆర్ పై చెన్నై లో ఉప్పొంగిన అభిమానం : మూడు కిలో మీటర్ల మేర స్తంబించిన ట్రాఫిక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

తమిళ నాడు రాజధాని చెన్నై మరో సారి పోటెత్తింది. అయితే ఈసారి వరద తుఫాన్ ది కాదు అభిమానానిది. జనతాగ్యారేజ్ షూటింగ్ కోసం చెన్నై లో ఉన్న యంగ్ టైగర్ ని చూడటానికి...ఒక్క నిమిషమైనా మాట్లాడటానికీ బారులు తీరారు ఆయన అభిమానులు .

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నఈ సినిమా షూటింగ్ చెన్నైలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయం తెలిసి ఎన్టీఆర్ అభిమానులంతా పొలోమంటూ స్టూడియో దగ్గరకు చేరుకున్నారు. చాంతాడంత క్యూలు కట్టి బారులు తీరారు.దీనితో అసలే ఇరుకుగా ఉండే చ్ఝెన్నై రోడ్లు మరింత గా ట్రాఫిక్ తో కిక్కిరిసి పోయాయి

JR-NTR

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా షూటింగ్ శరవేగంగా చెన్నైలో జరుగుతోంది కదా. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో సమంత, నిత్యా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జనతా గ్యారేజ్ కి దర్శకుడు కొరటాల శివ. మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఇందులో కీలకపాత్రలో నటిస్తున్నాడు.

ఈ విషయం తెలిసి ఎన్టీఆర్ అభిమానులంతా పొలోమంటూ స్టూడియో దగ్గరకు చేరి ఆయనని చూదటానికి ఎగబడ్దారు. షూటింగ్ గ్యాప్ లో బయటికి వచ్చిన తారక్ అందరితోనూ సన్నిహితంగ మెలుగుతూన్ ఆప్యాయంగా పలకరించాడట. ఈ సన్ని వేశాన్ని ఫొటో తీసిన నటుడు బ్రహ్మాజి తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసి "చెన్నైలో ట్రాఫిక్ జామ్.. తారకరాముడి దర్శనం కోసం" అంటూ ఒక కామెంట్ ఆడ్ చేసాడు.

తమిళనాడు లో ఉన్న తెలుగు వారందరికీ పెద్ద ఎంటీఆర్ అంటెర విపరీతమైన అభిమానం ఉంది. ఇప్పుడు ఆయన మనవడి మీద తమ ప్రేమని చూపించిన వారు కొందరైతే, స్వతహాగా తనకు ఉన్న ఫాలోయింగ్ వల్ల కూడా ఏర్పడ్డ తమిళ అభిమానులూ తారక్ ని కలిసేందుకు వచ్చారట ...

English summary
junior NTR Fans came to see him in chennai Janata garage sets.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu