జనతా గ్యారేజ్ ఫస్ట్ లుక్ ఎప్పుడో తెలిసి పోయింది
'జనతా గ్యారేజ్' షూటింగ్ ఆగమేఘాల మీద జరిగిపోతోంది. ఎప్పుడూ లేనంత సీరియస్ గా వర్క్ చేస్తున్నారు దర్షకుడు కొరటాల శివ. ఎన్టీఆర్ అభిమానులంతా ఈ సినిమా విశేషాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఆసక్తిని చూపుతున్నారు. సినిమా విజయావకాశాలమీద కూడా భారీ అంచనాలే నెలకొన్నాయి.
ఈ సినిమాకి సంబంధించిన వర్కిగ్ స్టిల్స్ మాత్రమే ఇప్పటిదాకా బయటికొచ్చాయితప్ప పెద్దగా వివరాలేం తెలియనివ్వటం లేదు. అయితే ఇప్పటిదాకా సోషల్ మీడియాలో ఆ వర్కింగ్ స్టిల్స్ నే చూసి మురిసిపోతోన్న అభిమానులు, ఈ సినిమా నుంచి రానున్న ఫస్టులుక్ కోసం ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పుడు అలాంటి అభిమానులకి ఆనందాన్ని కలిగించే వార్త ఒకటి ఫిల్మ్ నగర్లో షికారు చేస్తోంది. ఎన్టీఆర్ పుట్టినరోజు మే 20న కావడంతో, ఆ రోజునే జనతా గ్యారేజ్ ఫస్టులుక్ రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడట దర్షకుడు శివ.
అంతేకాదు అలాగే మే 28న మహానటుడు ఎన్టీ రామారావు జయంతి కావడంతో,సినిమా ఫస్టు టీజర్ ని కూడా ఆ సందర్భంగా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. ఇకనేం ఐతే వచ్చే నెలలో ఈ రెండు రోజులూ ఈసారి మరింత ప్రత్యేకం కానున్నాయన్నమాట


Click it and Unblock the Notifications











