»   » 'జనతా గ్యారేజ్‌' క్లైమాక్స్‌ లీక్ చేసిన బ్రహ్మాజీ(వీడియో)

'జనతా గ్యారేజ్‌' క్లైమాక్స్‌ లీక్ చేసిన బ్రహ్మాజీ(వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ రూపొందిస్తోన్న చిత్రం 'జనతా గ్యారేజ్‌'. సమంత, నిత్యా మీనన్ హీరోయిన్స్ గా నటిస్తుండగా, మోహన్‌లాల్‌ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్‌, సి.వి. మోహన్ నిర్మిస్తున్నారు. 'ఇచట అన్నీ రిపేర్లు చేయబడును' అనేది ట్యాగ్ లైన్.

రీసెంట్ గానే ఈ సినిమా క్లైమాక్స్‌ షూటింగ్ పూర్తయింది. ఈ క్లైమాక్స్ కు చెందిన ఓ చిన్న వీడియోని నటుడు బ్రహ్మాజీ తన ఇనిస్ట్రగ్రామ్ లో పోస్ట్ చేసారు. అదే జనతాగ్యారేజ్ లీక్ వీడియోగా ప్రచారం పొందుతోంది. దాన్ని మీరు ఇక్కడ చూడవచ్చు.


#janathagarage #climax


A video posted by Brahmaji Actor (@brahms25) on Jul 13, 2016 at 5:53am PDTఅలాగే.. 'జనతా గ్యారేజ్' సినిమాకు సంబంధించిన ఎన్టీఆర్ డాన్స్ వీడియో ఇప్పుడు నెట్‌లో హల్ చల్ చేస్తోంది. డాన్స్ మూమెంట్స్‌లో భాగంగా... టెర్రస్ పైన ఉన్న గోడ ఎక్కి ఎన్టీఆర్ స్టెప్పులు వేస్తుండడం ఈ వీడియోలో క్లారిటీగా కనిపిస్తోంది. ఈ వీడియోలో క్లిష్టమైన డాన్స్ మూమెంట్‌ను సింగిల్ టేక్‌లో చేసి.. అదుర్స్ అనిపించాడు తారక్.


ప్రస్తుతం సోషల్‌ సైట్స్‌లో ఈ లీకుడ్ వీడియో వైరల్‌లా స్ప్రెడ్ అవుతోంది. దీంతో ఈ విజువల్స్ ఎలా లీక్ అయ్యాయ్యన్న విషయంపై దృష్టి సారించారు 'జనతా గ్యారేజ్' నిర్మాతలు. మరోవైపు.. ఆగస్టు-12న ఈ సినిమాను విడుదల చేసేందుకు గానూ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగవంతం చేశారు.నిర్మాతలు మాట్లాడుతూ ''రెండు పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలుంది. ఓ పాటను హైదరాబాద్‌లో, మరో పాటను కేరళలో చిత్రీకరిస్తాం. దేవిశ్రీ ప్రసాద్‌ సమకూర్చిన బాణీలు ఓ ప్రధానాకర్షణ అవుతాయి. ఈ నెల 22న పాటల్ని విడుదల చేయాలని సంకల్పించాం.


కథ, కథనం, పాత్రల చిత్రణ, ఎన్టీఆర్‌, మోహన్ లాల్‌ నటన ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంటాయి. మా బేనర్‌ విలువను ఈ సినిమా మరింత పెంచుతుంది'' అని చెప్పారు.ఇక ఇప్పటికే విడుదలకు ఈ చిత్రం టీజర్‌ అత్యధిక వ్యూస్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. రెండు రోజుల్లోనే రెండు మిలియన్ వ్యూస్‌తో టాప్‌ ప్లేస్ కైవసం చేసుకుంది.


ఈ చిత్రానికి పాటలు: రామజోగయ్యశాస్త్రి, ఛాయాగ్రహణం: ఎస్‌. తిరునావుక్కరసు, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, కళ: ఎ.ఎస్‌. ప్రకాశ్, ఫైట్స్‌: అణల్‌ అరసు, రచన, దర్శకత్వం: కొరటాల శివ.


English summary
The Janatha Garage climax scene is leaked by actor Brahmaji. Here is the more information about Janatha Garage leaked clip.
Please Wait while comments are loading...