For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నిజాలు,నిజాయితీగ బయిటపెట్టిన ఎన్టీఆర్, సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో!?

  By Srikanya
  |

  హెదరాబాద్: ఒక పర్టిక్యులర్ సంఘటనతో మార్పు వచ్చేస్తుందని నేను భావించను. అది కొంత టైమ్ పీరియడ్ లో వచ్చేది. నాకైతే మార్పు నా కెరీర్ లో కొన్ని దెబ్బలు తిన్న తర్వాత వచ్చింది. నాన్నకు ప్రేమతో ముందు చేసిన కొన్ని సినిమాలు నాకు అనుకున్న రిజల్ట్ ఇవ్వలేదు. నటుడుగానూ, భాక్సాఫీస్ వద్ద కూడా తృప్తి కలిగించలేకపోయాయి.

  అలాగే నటులు అనేవాళ్లు నెంబర్ గేమ్ లో కు వెళ్లకూడదని నా అభిప్రాయం. ఎండ్ ఆఫ్ ది డే..భాక్సాఫీస్ రిజల్ట్ హిట్ లేక ఫ్లాఫ్ అనేది ప్రక్కన పెడితే నాకు చేసిన సినిమా ఆనందం కలిగించగలగాలి. నేను నా ఆనందాన్ని వెతుక్కోవటం మొదలెట్టాను. అది నా సినిమా లో ఖచ్చితంగా మీకు కనపడుతుంది అంటూ ఎన్టీఆర్ చాలా స్పష్టంగా నిజాయితీగా చెప్పారు.

  యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన 'జనతా గ్యారెజ్' సినిమా అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకొని మరో రెండు రోజుల్లో థియేటర్ల ముందుకు వచ్చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ప్రమోషన్స్ వేగం పెంచారు. ప్రమోషన్స్ లో భాగంగా ఓ ప్రక్కన కొరటాల శివ, మరో ప్రక్క ఎన్టీఆర్ మీడియాకు ఇంటర్వూలు ఇస్తున్నారు. ఇక్కడ మీకు ఎన్టీఆర్ ఇచ్చిన ఇంటర్వూలో ముఖ్యాంశాలు అందిస్తున్నాం.

  ఈ ఇంటర్వూలో భాగంగా ఆయన మాట్లాడుతూ..తన ముద్దుల కుమారుడు అభయ్‌రామ్‌ అల్లరి చేసినప్పుడు మందలిస్తే.. తిరిగి గట్టిగా కొడుతున్నాడని హీరో ఎన్టీఆర్‌ అన్నారు. అలాగే మరిన్నో విషయాలు సినిమా గురించి మాట్లాడారు. ఆయన మాటల్లో ఈ సినిమా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం వ్యక్తమవుతోంది. అలాగే అభిమానులు సైతం ఈ సినిమా విజయం పై చాలా ఆశలు పెట్టుకున్నారు.

  ముఖ్యంగా ..'మిర్చి', 'శ్రీమంతుడు'తో తన పంథా స్పష్టం చేసిన కొరటాల శివ దర్శకుడు కావటం సినిమాకు బాగా ప్లస్ అవుతుందని బావిస్తున్నారు. ఆ సినిమాల్లో ఓ సామాజిక స్పృహతో కూడిన అంశాన్ని కమర్షియల్‌ కోణంలో చెప్పి... విజయాల్ని సాధించారు. ఇప్పుడు 'జనతా గ్యారేజ్‌'లోనూ అదే మ్యాజిక్‌ చేయబోతున్నారు.

  'ఇప్పటిదాకా కొరటాల తన సినిమాలతో చూపించింది చాలా తక్కువ. అతడిలో ఇంకా చాలా డైమన్షన్లు ఉన్నాయి. అతడిపై ఒక ముద్ర వేయకూడదన్నది నా అభిప్రాయం అంటున్నారు ఎన్టీఆర్ .

  స్లైడ్ షోలో ఎన్టీఆర్ ఇంటర్వూలో ని ముఖ్యాంశాలు

  టెన్షన్ గా ఉంది

  టెన్షన్ గా ఉంది

  ‘రభస' సమయంలోనే ఈ కథ విన్నా, బాగా నచ్చింది. బిజీగా ఉండటం వల్ల చేయలేకపోయాను. ‘నాన్నకు ప్రేమతో..' తర్వాత మొదలైంది. ఈ సినిమాలో ‘జనతా గ్యారేజ్‌' అనేది చాలా ముఖ్యం.

  డైమన్షన్స్ ఉన్నాయి

  డైమన్షన్స్ ఉన్నాయి

  కొరటాల శివలో చాలా డైమన్షన్లు ఉన్నాయని.. అతణ్ని యాక్షన్ డైరెక్టర్ అనో.. కమర్షియల్ డైరెక్టర్ అనో ఒక ముద్ర వేసి.. ఒక ఛట్రంలో బిగించడం సరి కాదని ఎన్టీఆర్ అన్నాడు.

  ట్రావిల్ అవుతున్నా

  ట్రావిల్ అవుతున్నా

  కొరటాలతో కొన్నేళ్లుగా తాను ట్రావెల్ అవుతున్నానని.. అతను రచయితగా.. దర్శకుడిగా కంటే తనకు వ్యక్తిగా మరింత ఇష్టమని ఎన్టీఆర్ చెప్పాడు. కొరటాల నుంచి భవిష్యత్తులో మరిన్ని గొప్ప సినిమాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశాడు.

  ఆనంద్ పాత్రలో

  ఆనంద్ పాత్రలో

  మలయాళ నటుడు మోహన్‌లాల్‌తో కలిసి నటించడం ఆనందంగా ఉంది. ఆయన ఓ సంపూర్ణమైన వ్యక్తి. ఇందులో నేను ఆనంద్‌ అనే పాత్రలో ప్రకృతి ప్రేమికుడిగా కనిపిస్తాను.

  బేసిగ్గా

  బేసిగ్గా

  నాకు దర్శకుడిగా.. రచయితగా కంటే కొరటాల ఒక వ్యక్తిగా బాగా ఇష్టం. అతడికి సమాజం పట్ల ఓ బాధ్యత ఉంటుంది. తన సినిమాల్లో కనిపించే మంచి ఆలోచనలన్నీ తన వ్యక్తిత్వం నుంచి వచ్చినవే. అతను బేసిగ్గా చాలా ఎమోషనల్. ఎప్పుడూ మంచి విషయాలే ఆలోచిస్తాడు. అవే తెరమీదా చూపిస్తాడు.

  మనుష్యులను కూడా

  మనుష్యులను కూడా

  ‘ఇచట అన్నీ రిపేర్లు చేయబడును' అంటే వాహనాలతో పాటు మనుషులను కూడా రిపేర్‌ చేస్తారని అర్థం.

  ఫ్యామిలీ ఫిల్మ్

  ఫ్యామిలీ ఫిల్మ్

  దర్శకుడు కొరటాల శివ తక్కువ సమయంలోనే చిత్రాన్ని బాగా తీశారు. ఇది యాక్షన్‌ చిత్రం కాదు, కుటుంబ కథా చిత్రం.

  గౌరవం తెచ్చి పెట్టే సినిమాలు

  గౌరవం తెచ్చి పెట్టే సినిమాలు

  ‘బృందానవం' నుంచి కొరటాలతో ట్రావెల్ అవుతున్నాను. అతణ్ని దగ్గరగా చూశాను. ఎంతో తపన ఉన్న వ్యక్తి. అతను మున్ముందు మరింత గొప్ప సినిమాలు చేస్తాడు. అతడి దగ్గర ఇంకా చాలా ఆలోచనలున్నాయి. తెలుగు సినిమాకు గౌరవం తెచ్చిపెట్టే మరిన్ని సినిమాలు చేస్తాడని నా నమ్మకం'' డు.

  టైటిల్ ఇదే ఫెరఫెక్ట్

  టైటిల్ ఇదే ఫెరఫెక్ట్

  ‘జనతా గ్యారేజ్‌' టైటిల్‌ ముందు నుంచీ అనుకున్నదే. ఈ కథకు ఇంతకన్నా మంచి టైటిల్‌ దొరకదు. సమంత, నిత్యా మేనన్‌లు చాలా చక్కగా నటించారు. హీరోయిన్లకు ఇలాంటి పాత్రలు దొరకడం అరుదు.

  కొడుకు గురించి..

  కొడుకు గురించి..

  ‘బాబు బాగా అల్లరి. మట్టిలో ఆడుకుంటున్నాడు. వాడి కోసం వీలైనంత ఎక్కువ సమయం కేటాయిస్తున్నా. అల్లరి చేసినప్పుడు మందలిస్తే.. తిరిగి గట్టిగా కొడుతున్నాడు. తండ్రి అన్న అనుభూతి బాగుంటుందని అందరూ అంటుంటే నాకు తెలియలేదు. అది ఇప్పుడు అర్థమైంది.

  నెక్ట్స్ సినిమా గురించి

  నెక్ట్స్ సినిమా గురించి

  తర్వాతి సినిమా ఏం అనుకోలేదు. కొంత బ్రేక్‌ తీసుకుని అప్పుడు ఆలోచిస్తాను' అని ఎన్టీఆర్‌ అన్నారు.

  భార్య గురించి

  భార్య గురించి

  నా భార్య నా సినిమాల గురించి ఎప్పుడూ మాట్లాడదు..ఆమె చాలా కష్టపడి పనిచేసే వ్యక్తిత్వం కలది. భాధ్యతగల తల్లిగా ఆమెకు కొన్ని కలలు ఉన్నాయి. ఆమె నా దగ్గర వేరేవారి సినిమాలు బాగున్న వాటి గురించి మాట్లాడుతుంది. ఆమె నా ఇన్ఫర్మేషన్ భాక్స్.

  English summary
  Ntr said..."The beauty of Janatha Garage is no actor can dominate the film. Neither me, nor Mohanlal. We are all actors doing our parts for the larger concept called Janatha Garage. It’s a place where anything and everything is repaired, from vehicles to relationships."
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X